Begin typing your search above and press return to search.

శివరాత్రిని సంక్రాంతి చేసిన నివేదా

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:08 PM GMT
శివరాత్రిని సంక్రాంతి చేసిన నివేదా
X
ఒకోసారి మనకు తెలియకుండా జరిగే పొరపాట్లు గతంలో చెల్లిపోయేవి కాని టెక్నాలజీ పుణ్యమా అని సోషల్ మీడియా విస్తృతం అయ్యాక మాట మార్చే పరిస్థితి లేకుండా పోయింది. చెప్పే ప్రతి మాట రాసే ప్రతి వాక్యం రికార్డు రూపంలో నెట్టింట్లో ఉంటోంది కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మలయాళ బ్యూటీ నివేదా థామస్ ఇది కాసేపు మర్చిపోయింది కాబోలు ఏకంగా పండగ మార్చేసి గ్రీటింగ్స్ చెప్పి ఆ తర్వాత నాలుక కరుచుకుంది. తన ట్విట్టర్ లో ఇవాళ అభిమానులతో చాట్ చేస్తున్న నివేదా పరధ్యానంలోనో లేక నిజంగా కావాలని అన్నదో కాని ఈ రోజు మహాశివరాత్రి పెట్టుకుని మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసి అభిమానులను షాక్ కి గురి చేసింది. సంక్రాంతి పండగ అయిపోయి నెల దాటింది. ఏదో వారం క్రితం అంటే పొరపాటు అనుకోవచ్చు.

ఇలా చెప్పడం ఆలస్యం మనవాళ్ళు ఊరికే ఉంటారా. కామెంట్స్ లో కొందరు వ్యంగ్య బాణాలు విసరగా ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయిపోయి ఇలా పండగ మార్చేస్తే ఎలా అని నిలదీయటంతో తప్పు గుర్తించిన నివేదా వెంటనే సారీ చెబుతూ ఈసారి మాత్రం శివరాత్రి శుభాకాంక్షలు అంటూ మాట మార్చేసింది. స్వతహాగా క్రిస్టియన్ అయిన నివేదా థామస్ హిందు పండగల గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు. పైగా కేరళలో ఓనం పేరిట సంక్రాంతికి ఉన్నంత హడావిడి శివరాత్రికి ఉండదు. బహుశా ఆ ఏమరుపాటులో ఇలా స్లిప్ అయ్యి ఉండొచ్చు. తర్వాత రకరకాల ట్వీట్లతో టాపిక్ డైవెర్ట్ చేసే ప్రయత్నం చేసింది కాని ఆ పాటికే ఇది వైరల్ అయిపోయింది.

అన్నట్టు తన కొత్త తెలుగు సినిమాల గురించి ఏమి చెప్పడం లేదు నివేదా. అసలు ఆఫర్స్ వస్తున్నాయా లేదా లేక వచ్చినవి తనకు నచ్చడం లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. లాస్ట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్, నానితో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్న నివేదా ఇప్పటిదాకా కొత్త తెలుగు ప్రాజెక్ట్ సైన్ చేయకపోవడం పట్ల తనేమో కాని ఫాన్స్ మాత్రం తెగ ఖంగారు పడుతున్నారు. వాళ్ళ కోసమైనా ఏదైనా అప్ డేట్ ఇస్తే బాగుండు.