Begin typing your search above and press return to search.

పాముతో నివేదా-భయం లేదా

By:  Tupaki Desk   |   12 Feb 2018 11:45 AM GMT
పాముతో నివేదా-భయం లేదా
X
నాని జెంటిల్ మెన్ మూవీలో అందరిని ఆకట్టుకున్న నివేదా థామస్ ప్రస్తుతానికి చేతిలో సినిమాలేమి లేకుండా లీజర్ ని ఎంజాయ్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ నిన్ను కోరి, జై లవకుశ చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయం సాధించినా ఆఫర్స్ మటుకు వెల్లువలా తనను వరించలేదు. దానికి తోడు కెరీర్ ప్రారంభంలో ఒప్పుకున్న జూలియట్ లవర్ అఫ్ ఇడియట్ విడుదల కావడం, పట్టుమని రెండు రోజులు కూడా ఆడకుండా డిజాస్టర్ ఖాతాలోకి వెళ్ళిపోవడం కొంచెం ఎఫెక్ట్ చూపించింది. కాని సాధించిన సక్సెస్ పరంగా చూసుకుంటే నివేదా థామస్ చేతి నిండా ఆఫర్స్ ఉండాలి. కాని విచిత్రంగా తనే వద్దనుకుందో లేక ఎవరు తనను అప్రోచ్ అవ్వడం లేదో తెలియదు కాని నివేదా అయితే ఇంకా కొత్త సినిమాల విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

తాజాగా ఒక కొండచిలువను మెడలో వేసుకుని దిగిన ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. లావైన కొండచిలువని ధైర్యంగా మేడపై వేసుకుని దాన్ని అంత దగ్గరగా చూస్తూ కూడా నవ్వుతూ ఫోజిచ్చిన నివేదాకు నెటిజెన్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇదేమి భయపడేంత పెద్ద విషయం కాదన్న నివేదా అనుకున్నంత చిన్న విషయం కూడా కాదని తన ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ చెప్పింది. ఏదో సినిమా కోసం తన హెయిర్ స్టైల్ మార్చి కొద్దిగా బాబ్డ్ లుక్ లో వచ్చిన నివేదా కొత్త సినిమాల విశేషాలు మాత్రం బయటికి చెప్పడం లేదు. రెండు హిట్లు వచ్చినా నివేదా ఫ్రీగా ఉండటం ఫాన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్ను కోరిలో భర్తకు, మాజీ ప్రియుడికి మధ్య నలిగిపోయే పాత్ర నివేదా పర్ఫార్మెన్స్ అందరిని మెప్పించింది.

మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మాట దాటవేస్తున్న నివేదా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మల్టీ స్టారర్ లో ఒక పాత్ర చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కాని నివేదా కాని సినిమా యూనిట్ కాని ఇంకా ధృవీకరించలేదు. శర్వానంద్ - నితిన్ కాంబోలో తెరకెక్కే ఆ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దితున్నట్టు టాక్. మరో హీరొయిన్ గా రకుల్ ఓకే అయినట్టు టాక్.