Begin typing your search above and press return to search.

అలా అయితే పీకే ఫ్యాన్స్ అప్సెట్ అవ్వరా?

By:  Tupaki Desk   |   4 Jun 2020 6:10 AM GMT
అలా అయితే పీకే ఫ్యాన్స్ అప్సెట్ అవ్వరా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ హిందీ చిత్రం 'పింక్' కు రీమేక్. అయితే ఈ సినిమాలో నివేద పాత్ర వెయిటేజ్ ఎక్కువగా ఉండడంతో పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమోనని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.

మన నేటివిటీ.. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు తెలుగు వెర్షన్ లో కొన్ని స్వల్ప మార్పులు చేసినప్పటికీ సినిమా ఎక్కువగా నివేద థామస్ చుట్టూనే తిరుగుతుంది. సినిమా అంతా నివేద పాత్రే హైలైట్ అవుతుందని అంటున్నారు. పవన్ హీరోయిజం.. యాక్షన్ బ్లాక్స్ ఉన్నప్పటికీ ఇలా హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడం పవన్ ఫాన్స్ ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నాయట. కోర్టు రూమ్ లో వాదనలు జరిగే సమయంలో కూడా పవన్ కు సమానంగా నివేదకు స్కోప్ ఉంటుంది.

పవన్ రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ఉన్న సమయంలో వచ్చిన సినిమా అయితే పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఇది రీఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. పైగా పవన్ ఓ మాస్ హీరో. తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. మరి ఇలా నివేద పాత్ర హైలైట్ అయితే అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అని చర్చలు సాగుతున్నాయి.