Begin typing your search above and press return to search.

చదువుల రూట్‌ లో జెంటిల్'ఉమన్'

By:  Tupaki Desk   |   27 Dec 2017 9:54 AM IST
చదువుల రూట్‌ లో జెంటిల్ఉమన్
X
టాలీవుడ్ లో మలయాళీ సుందరాంగుల హల్ చల్ బాగానే ఉంది. గ్లామర్ కంటే పెర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్లను వీరు మెప్పిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. తెలుగులో అడుగు పెట్టినప్పటి నుంచి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న భామలలో నివేదా థామస్ కూడా ఉంది.

ఇప్పటివరకూ ఈ బ్యూటీ 3 సినిమాలలో నటిస్తే.. అన్నీ సక్సెస్ లు సాధించాయి. నానితో జెంటిల్ మ్యాన్.. నిన్ను కోరి అంటూ వరుస విజయాలు సాధించిన నివేద.. ఆ వెంటనే జై లవకుశ అంటూ మరో సూపర్ హిట్ అందుకుంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సుందరాంగి కచ్చితంగా సినిమాలతో బిజీ అయిపోతుందని అనుకుంటాం. కానీ సబ్జెక్టుల ఎంపికలో ఈమె బాగా అలర్ట్ గా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక్క సినిమాకు కూడా ఈమె సైన్ చేయలేదు. ఇందుకు కారణం.. ఈ జెంటిల్ మ్యాన్ బ్యూటీ ప్రస్తుతం చదువులపై దృష్టి పెట్టడమే.

ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్న నివేదా థామస్.. ఇప్పుడు తన పూర్తి కాన్సంట్రేషన్ అంతా చదువులపై ఫోకస్ చేసింది. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత.. వాటిని కంప్లీట్ చేసి.. అప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతుందట. నివేదకు ఫస్ట్ ప్రయారిటీ చదువులు మాత్రమేనని.. సినిమాలు ఆమెకు సెకండ్ ఆప్షన్ మాత్రమేనని చెబుతున్నారు సన్నిహితులు.