Begin typing your search above and press return to search.

అడ్డు రాకపోతే బాక్సులు బద్దలుకొట్టేసేదే

By:  Tupaki Desk   |   14 July 2017 5:56 AM GMT
అడ్డు రాకపోతే బాక్సులు బద్దలుకొట్టేసేదే
X
సంవత్సరాలు కాదు.. దశాబ్దాల తరబడి తెలుగు సినిమాల్లో నటించినా.. ఒక్క ముక్క తెలుగు నేర్చుకోని హీరోయిన్లు చాలామందే ఉంటారు. కొన్నేళ్ల క్రితం వరకూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది. కానీ ప్రస్తుత జనరేషన్ భామలు.. తెలుగోళ్లను ఆకట్టుకోవడానికి తెలుగు నేర్చుకోవడం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని పసి గట్టేశారు. అందుకే వచ్చీ రావడంతోనే తెలుగు నేర్చేసుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్.. రాశి ఖన్నా.. నిత్యా మీనన్ లు తాము ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టుకుని మరీ తెలుగు నేర్చుకున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు నాని బ్యూటీ నివేదా థామస్ కూడా చేరింది. గతేడాది నానితో కలిసి జెంటిల్ మ్యాన్ సినిమాలో కనిపించిన నివేద.. రీసెంట్ గా న్యాచురల్ స్టార్ తోనే నిన్ను కోరి అంటూ మరో హిట్ కూడా కొట్టేసింది. తాను తెలుగు ఎంతగా నేర్చేసుకున్నాననే విషయాన్ని.. నిన్ను కోరి ప్రమోషన్స్ లో చూపించేసింది కూడా. ఇంతగా తెలుగు వచ్చినపుడు మరి డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా అనిపించచ్చు. కానీ.. సరిగ్గా ఆ సమయాలకే ఈమెకు పరీక్షలు అడ్డొచ్చాయట.

ఒకవైపు ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేస్తున్న నివేదా థామస్.. మరోవైపు సినిమాలు చేస్తోంది. జెంటిల్ మ్యాన్.. నిన్ను కోరి చిత్రాల డబ్బింగ్ సమయానికి.. ఈమెకు సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయట. అందుకే చెప్పలేకపోయానని.. లేకుంటే తన వాయిస్ తో సౌండ్ బాక్సులు బద్దలు కొట్టేసేదాన్నని చెబుతోంది నివేదా థామస్. తన మరుసటి చిత్రంలో మాత్రం సొంత గొంతు వినిపించాలని భావిస్తోందట. ఇప్పుడీ బ్యూటీ ఎన్టీఆర్ తో కలిసి జై లవ కుశ మూవీలో నటిస్తోన్న సంగతి తెలుసు కదా!