Begin typing your search above and press return to search.

అఖిల్ కు జోడిగా మెంటల్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   7 July 2019 10:34 AM GMT
అఖిల్ కు జోడిగా మెంటల్ బ్యూటీ?
X
ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన అఖిల్ 4 ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళలేదు. ఈ నెల మూడో వారం నుంచి షెడ్యూల్ చేసినట్టుగా టాక్ ఉంది. అసలు సమస్యగా మారిన హీరోయిన్ సెలక్షన్ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. రష్మిక మందన్న పేరు ఒకసారి కియారా అద్వానీ అని మరోసారి న్యూస్ వచ్చాయి కానీ కాల్ షీట్స్ ప్రాబ్లమ్ వల్ల ఇద్దరూ నో చెప్పినట్టు వినికిడి. ఇదిలా ఉండగా మరో ఆప్షన్ గా మెంటల్ మదిలో బ్యూటీ నివేత పేతురాజ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్.

ఈ ఏడాది తనకు రెండు చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఒకటి చిత్రలహరి కాగా రెండోది బ్రోచేవారెవరురా. ఇవి రికార్డులు బద్దలు కొట్టిన మూవీస్ కాకపోయినా పెట్టుబడి లెక్కల్లో సేఫ్ గా నిలిచిన ప్రాజెక్ట్స్ కావడంతో తనకు అవి ప్లస్ గానే నిలిచాయి. ఇదే కారణమని చెప్పలేకపోయినా టైం ముంచుకొస్తోంది కాబట్టి ఫైనల్ ఆప్షన్ గా నివేత పేతురాజ్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ టాక్.

ఎవరిని ఎంపికా చేసుకున్నా ఇంకో వారంలోపు తేల్చేసి ప్రకటించాల్సిందే. దీనికి సంబంధించిన కసరత్తుకే ఆలస్యం అవుతున్నట్టు ఉంది. బొమ్మరిల్లు తర్వాత సక్సెస్ లేని దర్శకుడు భాస్కర్ ఈ కథని ఎలా మలిచుంటాడా అనే ఆసక్తి అక్కినేని ఫాన్స్ లో ఉంది. స్క్రిప్ట్ లో అంత విషయం లేనిదే గీత కాంపౌండ్ అక్కినేని ఫ్యామిలీ కంబైన్డ్ గా పాస్ చేయరు కదా అనేది వాళ్ళ నమ్మకం. డెబ్యూ చేసి మూడు సినిమాలు దాటినా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి