Begin typing your search above and press return to search.

మెంటల్ బ్యూటీని కొత్తగా చూస్తారట!

By:  Tupaki Desk   |   14 Sep 2019 4:55 AM GMT
మెంటల్ బ్యూటీని కొత్తగా చూస్తారట!
X
శ్రీవిష్ణు మెంటల్ మదిలోతో పరిచయమై టాలెంట్ తో పాటు బ్యూటీ ఉందని నిరూపించుకున్న నివేత పేతురాజ్ అవకాశాలను ఒడిసిపట్టడంలో మాత్రం కొంత స్లోగానే ఉంది. అయితే ఈ ఏడాది రెండు చెప్పుకోదగ్గ విజయాలు తన ఖాతాలో వేసుకున్న నివేతకు చిత్రలహరి - బ్రోచెవారెవరురా ఫలితాలు బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న అల వైకుంఠపురములో ఛాన్స్ కొట్టేసిన నివేత పెతురాజ్ అందులో తన పాత్ర గురించిన వివరాలు మాత్రం గుట్టుగా ఉంచుతోంది.

అయితే మునుపెన్నడూ చూడని కొత్త గ్లామరస్ అవతారంలో తనను చూడొచ్చనే హింట్ మాత్రం ఇస్తోంది. ఇప్పటిదాకా నివేత చేసినవన్నీ సాఫ్ట్ రోల్సే. ఎందులోనూ స్కిన్ షో కాదు కదా కనీసం నడుం చూపించే అవకాశం కూడా దక్కలేదు. సో అల వైకుంఠపురములో నివేత ఫ్యాన్స్ కు స్పెషల్ ఫీస్ట్ ఉంటుందన్న మాట. ఇప్పటికే కీలక భాగం పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.

ఇది కనక క్లిక్ అయితే తనకో పెద్ద బ్రేక్ అవుతుందన్న నమ్మకంతో ధీమాతో నివేత పెతురాజ్ కాన్ఫిడెన్స్ తో ఉంది. పూజా హెగ్డే లాంటి హాట్ బ్యూటీ మెయిన్ హీరొయిన్ గా ఉండగా నివేతకు ఎంతవరకు స్కోప్ దక్కి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తన మీద ఒకటో రెండో పాటలు కూడా ఉండే ఛాన్స్ కొట్టిపారేయలేం. సుశాంత్ - నవదీప్ - టబు - జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న అల వైకుంఠపురము మీద అభిమానుల అంచనాలు మాములుగా లేవు