Begin typing your search above and press return to search.

ఎదో ఒక రోజు తప్పకుండా చేస్తా

By:  Tupaki Desk   |   1 Dec 2017 1:30 AM GMT
ఎదో ఒక రోజు తప్పకుండా చేస్తా
X
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్యా పోటీ చాలా పెరిగిపోతోంది. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కొంత మంది హీరోయిన్స్ వారి అందాలతో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. అంతే కాకుండా నటనలోనూ వారికంటూ ఎదో ఒక స్పెషల్ గుర్తింపును అందుకుంటున్నారు. అదే తరహాలో ఇప్పుడు మరొక బ్యూటీ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఆమె ఎవరో కాదు మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్.

టాలీవుడ్ లో అమ్మడి నేమ్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అంతే కాకుండా కొందరు బడా నిర్మాతలు కూడా డేట్స్ అడుగుతున్నారని తెలుస్తోంది. మెంటల్ మదిలో అందంగా నటించి కుర్ర కారును ఆకర్షించిన నివేత పేతు రాజ్ కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలను చేస్తోంది. ఈ బ్యూటీ దుబాయ్ మిస్ ఇండియా కిరీటాన్ని కూడా అందుకుంది. ఇంతకుముందు అమ్మడు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లోనే ఉండేది.

నాన్న తెలుగు అమ్మ తమిళ్ అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటార్వ్యులో చెప్పింది. నిశాంత్ అనే తమ్ముడు కూడా ఉన్నట్లు వివరించింది. ఇకపోతే ఈ హీరోయిన్ మదిలో దాగి ఉన్న ఒక డ్రీమ్ గురించి కూడా చెప్పేసింది. ఎదో ఒక రోజు తప్పకుండా ఒక సినిమాను డైరెక్ట్ చేస్తాను అని తెలిపింది. అలాగే సినిమాల్లో గ్లామర్ పాత్రలను చేయడానికి ఇబ్బంది ఏమి లేదని చెబుతూ.. స్క్రిప్ట్ కి తగ్గట్టు నటిస్తానని చెప్పింది.