Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ బ్యూటీకి ఇలాంటి ఆఫర్లా!

By:  Tupaki Desk   |   29 Jun 2019 10:05 AM IST
టాలెంటెడ్ బ్యూటీకి ఇలాంటి ఆఫర్లా!
X
నిన్న విడుదలైన బ్రోచేవారెవరురా అపోజిషన్ లో ఉన్న కల్కిని తట్టుకుని మరీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సరదాగా గడిపిచిపోయేలా రాసుకున్న ఈ కిడ్నాప్ డ్రామా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. లీడ్ హీరోయిన్ నివేదా థామస్ అయినప్పటికీ మరో కీలక పాత్రలో నివేత పేతురాజ్ కూడా నటించింది. అయితే కథ ప్రకారం ఎక్కువ షేడ్స్ లేకపోవడం రెండు మూడు ప్లెయిన్ ఎక్స్ ప్రెషన్లు మినహా ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేయకపోవడం వల్ల తన కన్నా సత్యదేవ్ ఎక్కువ హై లైట్ అయ్యాడు.

ఇటీవలే వచ్చిన చిత్రలహరిలో నివేతది కొంచెం బెటర్ రోలే అయినప్పటికీ అందులోనూ కళ్యాణి ప్రియదర్శన్ హీరోకు జోడి. ఇక తమిళ్ లో చేసి తెలుగులో వచ్చిన డబ్బింగ్ చిత్రాలు టిక్ టిక్ టిక్ -రోషగాడులో నివేత హీరోయిన్ అని గుర్తించేలోపే థియేటర్ల నుంచి మాయమైపోయాయి. మంచి అందం గ్లామర్ టాలెంట్ అన్ని ఉన్న నివేతకు ఇలా జరగడం విచిత్రమే. ఇప్పుడు కమిట్ అయిన అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో సైతం ఎక్కువ ఆశించడానికి ఉండకపోవచ్చు. ఎందుకంటే పూజా హెగ్డే మెయిన్ లీడ్.

అత్తారింటికి దారేదిలో ప్రణీత అరవింద సమేత వీర రాఘవలో ఈషా రెబ్బ తరహాలోనే ఉంటుందన్న టాక్ ఇప్పటికే ఉంది. సో స్టార్ హీరోతో చేస్తున్న ఆనందం ఎక్కువ ఉండకపోవచ్చని అంటున్నారు. చూస్తుంటే వచ్చిన ఆఫర్స్ అన్నింటిని ఒప్పుకోవడం మినహా నివేతకు వేరే ఛాయస్ కూడా కనిపిస్తున్నట్టు లేదు. మెంటల్ మదిలో ఇచ్చిన మంచి డెబ్యు సరిగా ఉపయోగపడలేదు కాబోలు