Begin typing your search above and press return to search.
పవన్ సినిమాతో ఆ హీరోయిన్ నక్కతోక తొక్కినట్లేనా..?
By: Tupaki Desk | 24 April 2020 6:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలలోకి రావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ట్రాక్ లో ఉండగానే డైరెక్టర్ క్రిష్ తో మరో సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రూపొందించనున్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే సినిమా గురించి ఒక్కో విషయాన్నీ చిత్రయూనిట్ బయటపెడుతున్నారు. స్వాతంత్య్రం ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడట. ఈ సినిమా కథ మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ నడుస్తుందని చెప్పి ఆసక్తి రేకెత్తించారు. ఈ పీరియాడిక్ కథను క్రిష్ పవన్ ఇమేజ్ కి సరిపోయేలా తీర్చి దిద్దుతున్నాడట.
కానీ ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తేలలేదు. ఇప్పటికే ఓ హీరయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుందని, మెయిన్ హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటించే అవకాశం వుందని వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటించే సూచనలు కన్పిస్తున్నాయి. దర్శకుడు క్రిష్ నివేదను ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఇంతవరకు నివేదకు సరైన పాత్ర దొరకలేదు. కానీ ఈ సినిమాలో ఛాన్స్ రావడం లక్కీ అంటున్నారు. మరి ఈ సినిమా నివేద కెరీర్లో మార్పు తీసుకొస్తుందేమో చూడాలి.