Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇన్ స్టాగ్రామ్ విషకన్య

By:  Tupaki Desk   |   5 Sep 2019 10:56 AM GMT
ఫోటో స్టొరీ: ఇన్ స్టాగ్రామ్ విషకన్య
X
తమిళ భామ బ్యూటీ నివేద పేతురాజ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'మెంటల్ మదిలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 'చిత్రలహరి'లో నటించింది. ఈమధ్య జూన్ లో రిలీజై హిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన 'బ్రోచేవారెవరురా' లో కూడా హీరోయిన్ గా నటించింది. ఈభామ అందరూ హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్. మరీ దిశా పటాని స్టైల్ లో హాటు ఫోటోలు పోస్ట్ చేయ్యదు కానీ హాట్ గా అనిపించేలా కనిపించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈ భామ తన ఇన్ స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ తనకు స్టైలింగ్ చేసిన వారు లావణ్య బత్తిన & వెంకటేష్ అని వెల్లడించింది. శ్రీకృత్ శరణ్ ఫోటోగ్రఫీ అని కూడా వెల్లడించింది. ఈ ఫోటోలలో నివేద ఒక మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో ఫోటోకు పోజులిచ్చింది. అందాల విందు కనీసం మిల్లీ మీటర్ కూడా చేయలేదు కానీ హాటు ఎక్స్ ప్రెషన్స్ తోనే నెట్టుకొచ్చింది. అయితే ఆ హాటు ఎక్స్ ప్రెషన్స్.. స్టైలింగ్ మాత్రమే వంద స్కిన్ షోలకు సమానం అన్నట్టుగా ఉంది.

ఈ ఫోటోలకు "క్లాసీ లేడీ".. "బ్లాక్ క్యాట్ ఆన్ ఇన్ స్టా".. "ఇన్ స్టాగ్రామ్ విషకన్య".. "స్టైలిష్ తమిళాచ్చి" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక నివేద ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే 'పార్టీ'.. 'సంగ తమిళన్'.. 'జగజల కిల్లాడి'.. 'పొన్ మాణిక్కవేల్' అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటుగా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.