Begin typing your search above and press return to search.

ఈ అమ్మడు బన్నీతో బ్యాక్‌ టు బ్యాక్‌

By:  Tupaki Desk   |   2 July 2019 6:27 AM GMT
ఈ అమ్మడు బన్నీతో బ్యాక్‌ టు బ్యాక్‌
X
'మెంటల్‌ మదిలో'.. 'నీది నాది ఒకే కథ'.. 'చిత్రలహరి'.. 'బ్రోచేవారెవరురా' చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న నివేథ పేతురాజ్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె చేసిన బ్రోచేవారెవరురా చిత్రంతో మంచి గుర్తింపును దక్కించుకోవడంతో పాటు.. ప్రస్తుతం నటిస్తున్న సందర్బంగా బన్నీ దృష్టిని ఆకర్షించిన నివేథా తన తర్వాత సినిమాలో బన్నీ తర్వాత సినిమాలో కూడా ఖరారు అయినట్లుగా సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీ తర్వాత బన్నీ రెండు సినిమాలు చేయబోతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో చేయబోతున్న మూవీలో బన్నీ సరసన రష్మిక నటించబోతుందని తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న బన్నీ 'ఐకాన్‌' మూవీలో నివేథా పేతురాజ్‌ కు ఛాన్స్‌ దక్కినట్లుగా సమాచారం అందుతోంది. బన్నీ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా మనకు ఇప్పటకే సమాచారం అందింది.

మొదటి సారి బన్నీ కాస్త ఎజ్డ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎంసీఏ చిత్రం తర్వాత వేణు శ్రీరామ్‌ చాలా గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. స్క్రిప్ట్‌ చాలా బాగా వచ్చిందని దిల్‌ రాజు సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న 'ఐకాన్‌' మూవీ అప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.