Begin typing your search above and press return to search.

ఇంటర్వ్యూ: ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ 'పాగ‌ల్‌' క‌నెక్ట్ అవుతుంది: నివేదా పేతురాజ్‌

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:30 AM GMT
ఇంటర్వ్యూ: ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ పాగ‌ల్‌ క‌నెక్ట్ అవుతుంది: నివేదా పేతురాజ్‌
X
మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా న‌రేష్ కొప్పల్లి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''పాగల్''. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 14న థియేటర్లలో ఈ సినిమాని విడుద‌ల‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పాగల్' హీరోయిన్ నివేదా పేతురాజ్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు..

౼ 'పాగ‌ల్‌' స్క్రిప్ట్‌ ను డైరెక్ట‌ర్ న‌రేశ్ కుప్పిలి చెన్నై వ‌చ్చి నెరేట్ చేశాడు. ఫ‌స్ట్ టైమ్ విన‌గానే ఎమోష‌న‌ల్‌ గా క‌నెక్ట్ అయ్యాను. ఈ స్క్రిప్ట్ దిల్‌ రాజు గారికి బాగా న‌చ్చింది. ఆయ‌న కూడా నాతో మాట్లాడారు. అంత అనుభ‌వ‌మున్న నిర్మాత కాన్ఫిడెంట్‌ గా మాట్లాడిన విధానంతో సినిమాలో న‌టించాల‌ని అనుకున్నాను. పాండ‌మిక్ త‌ర్వాత షూటింగ్‌ ను స్టార్ట్ చేశారు. సినిమాను చ‌క‌చ‌కా పూర్తి చేశాం.

౼ డైరెక్ట‌ర్ ఈ స్క్రిప్ట్‌ ను ఐదు సార్లు నెరేట్ చేశారు. స్క్రిప్ట్ నెరేష‌న్ టైమ్‌ లోనే కొన్ని చోట్ల నేను ఏడ్చాను. తొలిసారే కాదు.. స్క్రిప్ట్ విన్న‌ప్పుడంతా ఆ ఎమోష‌నల్ సీన్స్‌ కు క‌న్నీళ్లొచ్చాయి. రీసెంట్‌ గా సినిమాను చూసిన‌ప్పుడు ఆ ఎమోష‌న‌ల్ సీన్స్‌ లో కన్నీళ్లొచ్చాయి. సినిమా అంతా ల‌వ్ ఫీల్‌ తోనే ఉంటుంది. 'స‌ఖి' సినిమాలో మాధ‌వ‌న్‌ - షాలిని మ‌ధ్య ఎలాంటి ఎమోష‌న్స్ ఉంటాయో, అలాంటి ఎమోష‌న్స్ మా సినిమాలోనూ ఉంటాయి. న‌టీన‌టులంద‌రూ చాలా గొప్ప‌గా న‌టించారు. ఈ సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది.

౼ 'పాగ‌ల్‌' సినిమాలో నా పాత్ర పేరు తీర‌. ముందుగా నా క్యారెక్ట‌ర్‌ కు గీత అని పేరు పెట్టారు. అయితే అందులో ఫీల్ లేద‌నిపించింది. అందుక‌ని బాగా ఆలోచించి సెట్స్‌ లోనే తీర అని క్యారెక్ట‌ర్‌ కు పేరు మార్చారు.

౼ న‌రేశ్ కుప్పిలి గారు మంచి నెరేట‌ర్‌. అయితే త‌ను డెబ్యూ డైరెక్ట‌ర్ టేకింగ్ ఎలా ఉంటుందోన‌ని అనుకునేదాన్ని. అయితే, కొన్నిరోజుల త‌ర్వాత త‌ను మూడు నాలుగు సినిమాల‌ అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిలా సినిమా చేస్తున్నాడ‌ని అర్థ‌మైంది.

౼ నేను ఏ సినిమా చేస్తున్నా కూడా ఏదో అయిపోవాల‌ని ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకోను. మంచి సినిమా చేస్తున్నాన‌నే ఫీల్ అవుతాను. ఈ సినిమా కూడా అంతే. సినిమా బాగా వ‌చ్చింది.

౼ విష్వ‌క్ సేన్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సెట్స్‌ లో కూడా ఒక‌చోట ఉండ‌డు. సినిమాలో విభాగాల‌పై త‌న‌కు మంచి అనుభ‌వ‌ముంది. పాతికేళ్ల‌కే త‌న‌లో మంచి ప‌రిణితి క‌నిపిస్తుంది.

౼ ఇక నిర్మాత‌లు దిల్‌ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్‌ గారి గురించి చెప్పాలంటే.. దిల్‌ రాజు గారి బ్యాన‌ర్‌లో ఎప్ప‌టి నుంచి సినిమా చేయాల‌నుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. అలాగే బెక్కెం వేణుగోపాల్‌ గారైతే నెరేష‌న్ స‌మ‌యం నుంచి తెలుసు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోనూ మంచి అనుబంధం ఏర్ప‌డింది.

౼ ప్రేమ‌లో ఉన్న‌వారంద‌రూ 'పాగ‌ల్‌' సినిమాకు క‌నెక్ట్ అవుతారు. ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే ద‌ర్శ‌కుడెంత పాగ‌ల్‌ లా ప్యాష‌న్‌ తో ఆలోచించి ఉంటాడో రేపు సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

౼ 'అర్జున్ రెడ్డి' మ్యూజిక్ విన్న‌ప్ప‌టి నుంచి ర‌ధ‌న్‌ కు పెద్ద ఫ్యాన్‌ గా మారాను. ఈ సినిమాకు త‌ను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ చక్క‌గా కుదిరింది. ఇందులో ఆరేడు సాంగ్స్ ఉన్నాయి. అందులో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ నాకు బాగా నచ్చింది.

౼ నేను చూడ‌టానికి సీరియ‌స్ అమ్మాయిలా క‌న‌ప‌డ‌తాను. కానీ నిజానికి నేను అలా ఉండ‌ను. నాకు వ‌చ్చే పాత్ర‌లు కూడా అలాగే ఉంటున్నాయి. రీసెంట్‌ గానే రేసింగ్‌ లో ఫ‌స్ట్ లెవ‌ల్‌ ను పూర్తి చేశాను. రేసింగ్ లొకేష‌న్‌ కు వెళ్ల‌గానే సినిమా అంటే ఏంటో పూర్తిగా మ‌ర‌చిపోతాను. హీరోయిన్స్, ఇత‌ర స్టార్స్ సినిమాల‌తో పాటు మ‌రో ఫీల్డ్‌ పై అవ‌గాహ‌న పెంచుకుంటే బావుంటుంద‌ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాండ‌మిక్ టైమ్‌ లో సినిమాలు రావ‌డం లేదంటూ చాలా మంది డిప్రెష‌న్‌ లోకి వెళుతున్నారు. సినిమాలు లేకుండా, అల్ట‌ర్‌నేటివ్ ఉంద‌నుకోండి.. ఆ ప‌నిని చేసుకోవ‌చ్చు. నేను ఫార్ములా వ‌న్ ట్రైనింగ్‌ లో ఉన్న‌ప్పుడే మూడు త‌మిళ సినిమాలు సైన్ చేశాను. డిసెంబ‌ర్‌ లో తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాను.