Begin typing your search above and press return to search.

నాని నివేదా.. ఒక పప్పు కథ

By:  Tupaki Desk   |   2 Jun 2017 2:43 PM GMT
నాని నివేదా.. ఒక పప్పు కథ
X
యంగ్ హీరో నాని ఎవరికైనా ఇట్టే కనెక్ట్ అయిపోతాడు. నేచురల్ అని పిలిపించుకుంటున్నా సరే డౌన్ టు ఎర్త్ బిహేవియర్.. నానిని మరో రేంజ్ కు తీసుకెళ్లపోతుంది. తాజాగా ఈ హీరో తన కొడుకు అర్జున్ తో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నెల రోజుల చిన్ని బుజ్జాయితో ఫోటో దిగి.. ఆ పిక్చర్ ను అభిమానులతో పంచుకోవడంతో.. బోలెడన్ని రియాక్షన్స్ వచ్చాయి. బోలెడన్ని అభినందనలు రాగా.. ఒక హీరోయిన్ నుంచి మాత్రం డిఫరెంట్ గా స్పందన వచ్చింది. జెంటిల్మన్ మూవీలో నానికి జోడీగా నటించిన నివేదా థామస్.. నాని-కొడుకు అర్జున్ ల ఫోటోకి 'పప్పు' అని కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ కి ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాని నాని.. క్లారిటీ కోసం తన స్టైల్ లో 'పప్పూ కిస్ కో బోలారే' అంటూ ప్రశ్నించాడు. ఆ తర్వాతే అసలు సిసలైన రియాక్షన్ వచ్చింది.

'అర్జున్ వాళ్ల నాన్నని పప్పు అన్నా.. మై కుట్టన్'(కుట్టన్ అంటే మలయాళంలో ఆత్మీయులను పిలుచుకునే ముద్దు పేరు) అనేసింది నివేదా థామస్. నాని- నివేదాల మధ్య ఎంతటి సఖ్యత ఉందనే సంగతి.. ఈ ఒక్క పిలుపు.. మాటా మంతీతో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/