Begin typing your search above and press return to search.

నిజంగానే లేడీ క‌మ‌ల్‌హాస‌న్ అంటున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2016 8:10 AM GMT
నిజంగానే లేడీ క‌మ‌ల్‌హాస‌న్ అంటున్నారు
X
ఆమ‌ధ్య జ‌రిగిన జెంటిల్‌ మ‌న్ ఆడియో ఫంక్ష‌న్‌ లో నాని మైకందుకొని ఈ అమ్మాయి లేడీ క‌మ‌ల్‌ హాస‌న్ అనేశాడు. నివేదా థామ‌స్‌ ని చూపిస్తూ. అప్ప‌టిదాకా ఆ అమ్మాయి ఎవ‌రో కూడా తెలుగు జ‌నాల‌కి తెలియ‌దు. ఒక్కసారిగా క‌మ‌ల్‌ తో పోల్చేస‌రికి `ఎవ‌ర‌బ్బా ఆ అమ్మాయి` అని ప‌క్క‌నే నివేదా గురించి ఆరా తీశారంతా. `నాని అంత‌గా చెప్పేశాడు, నిజంగా ఆ అమ్మాయి మంచి ప‌ర్‌ ఫార్మ‌రా? అదీ చూద్దాం సినిమా విడుద‌ల కూడా ద‌గ్గ‌ర్లోనే ఉంది క‌దా` అంటూ ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కి జంటిల్‌ మ‌న్ విడుద‌లైంది.

సినిమా చూసిన‌వాళ్లంతా నీట్ థ్రిల్ల‌ర్ అంటున్నారు. అయితే ఎక్కువ‌మంది నెటిజ‌న్లు నివేదా థామ‌స్ న‌ట‌న‌ని ప్ర‌స్తావిస్తున్నారు. ఆ అమ్మాయి సూప‌ర్ అంటున్నారు. నాని పోలిక క‌రెక్టే అనీ, లేడీ క‌మ‌ల్‌ లా పాత్ర‌లో ఇమిడిపోయి న‌టించింద‌ని కితాబునిస్తున్నారు. మ‌రికొద్దిమంది తెలుగు చిత్రసీమ‌లో మ‌రికొన్నాళ్ల‌పాటు వెలిగే స‌త్తా ఉన్న క‌థానాయిక అని పొగుడుతున్నారు. సినిమాలో నివేదా కేథ‌రిన్ అనే అమ్మాయిగా న‌టించింది. అందంగా క‌నిపించ‌డంలోనూ - ఎమోష‌న్స్‌ తో కూడిన స‌న్నివేశాల్లోనూ అద‌ర‌గొట్టేసింది నివేద‌. ఇప్ప‌టికే తెలుగు కూడా నేర్చేసుకొంది కాబ‌ట్టి ఆమె తెలుగు ఇండ‌స్ట్రీని ఊపేసే ఉద్దేశంతోనే వ‌చ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అన్న‌ట్టు నివేదా పాపనాశంలో క‌మ‌ల్‌ హాస‌న్ కూతురుగా న‌టించింది. ఆ చిత్రంలో న‌టిస్తున్న‌ప్పుడే క‌మ‌ల్ నుంచి కిటుకుల‌న్నీ ప‌ట్టేసిందో ఏంటో మ‌రీ!!