Begin typing your search above and press return to search.

కొత్త ఆఫర్లు రాలేదంటున్న నాని హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Jun 2016 4:27 AM GMT
కొత్త ఆఫర్లు రాలేదంటున్న నాని హీరోయిన్
X
నివేదా థామస్.. టాలీవుడ్ లో ఇప్పుడీ హీరోయిన్ పేరు మార్మోగిపోతోంది. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మన్ తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. ఈ మూవీతో మాగ్జిమం అటెన్షన్ దక్కించుకుంది. అసలీ సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి తర్వాత అంతగా ఉపయోగపడేది ఈ భామకే అని చెప్పచ్చు.

తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ను సాధించేయడం.. పక్కన నాని ఉండగా యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ కు కనెక్ట్ కావడం అంత తేలిక కాదు. అయినా సరే జెంటిల్మన్ చూసినోళ్లకు నివేద నటన విపరీతంగా నచ్చుతుంది. అంతగా తన ట్యాలెంట్ ను చూపించింది ఈ భామ. అయితే స్కిన్ షో విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం.. పిసరంత కూడా గ్లామర్ గా కనిపించబోనని తేల్చేయడం వంటివి.. ఈమెకు కొంత మైనస్ పాయింట్స్ అని చెప్పచ్చు. అయితే.. ఒక జెంటిల్మన్ లోని ఒక సీన్ లో ఈమె షార్ట్ డ్రస్ వేసినప్పుడు గమనిస్తే.. ఈమె గ్లామర్ చూపించడం కంటే చూపించకపోవడమే బెటర్ అనే ఫీలింగ్ సహజం.

బహుశా ఈ కారణంతోనే జెంటిల్మన్ చిత్రంతో సక్సెస్ సాధించినా ఇప్పటివరకూ ఈమెకు అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటీ అరా గాసిప్స్ ను తోసిపుచ్చుతూ.. తను ఏ తెలుగు సినిమాకి సైన్ చేయలేదని తేల్చేసింది నివేద. “జెంటిల్మన్ తర్వాత నేను ఇప్పటివరకూ ఒక్క తెలుగు సినిమాకి కూడా సైన్ చేయలేదు. చేసినప్పుడు మీకు తప్పకుండా చెబుతాను” అంటూ తన సోషల్ పేజ్ లో పోస్ట్ చేసింది నివేదా థామస్.