Begin typing your search above and press return to search.

స్కిన్‌ షో చేసేదే లేదు.. దట్సిట్!!

By:  Tupaki Desk   |   18 Jun 2016 3:30 PM GMT
స్కిన్‌ షో చేసేదే లేదు.. దట్సిట్!!
X
నేచురల్ స్టార్ నానికి హీరోయిన్ గా నివేద థామస్ టాలీవుడ్ అరంగేట్రం చేసింది. బేస్ ప్రకారం చెప్పాలంటే.. ఈ అమ్మడు కేరళ నుంచి వచ్చి ఇక్కడ గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ మధ్య మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ మీద బాగానే కన్నేశారు. అక్కడ ఒకే సినిమా చేసినా.. ఇక్కడ వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేసేస్తున్నారు.

అనుపమా పరమేశ్వరన్ .. మంజిమా మోహన్ ల తర్వాత ఈ లిస్ట్ లో జెంటిల్మన్ బేబీ నివేదా థామస్ చేరుతుంది. ట్యాలెంట్ విషయంలో ఈ భామకు పోలిక పెట్టడం కూడా చాలా కష్టం. తను కనిపించే ప్రతీ ఫ్రేమ్ ను అంతగా రక్తి కట్టించడం ఈ సుందరాంగి ప్రత్యేకత అని చెప్పచ్చు. అందుకే జెంటిల్మన్ సినిమాలో ఈమె నటన బాగా ఇంప్రెస్ చేసింది అందరినీ. అయితే మనోళ్ళకి యాక్టింగ్‌ ఒక్కటే నచ్చదుగా. ఏదో నిత్యామీనన్ అంటే చాలా అందంగా ఉంది కాబట్టి.. స్కిన్‌ షో విషయం గురించి ఎక్కువగా అడగలేదు. కాని నివేద అలా కాదండోయ్.

కాసింత కాదు.. పిసరంత కూడా తన బాడీని ప్రదర్శనకు ఉంచబోనని తేల్చేసింది. పర్సనల్ ఫీలింగ్స్ ని ప్రొపెషన్ పై చూపించకుండా సక్సస్ ఫు్ల్ గా కెరీర్ గా కంటిన్యూ చేస్తాను అంటూనే.. స్కిన్‌ షో గురించి మాత్రం డిమాండ్‌ చేయకండి అంటూ సున్నితంగా చెప్పేసింది.