Begin typing your search above and press return to search.

చెన్న‌య్ చంద్రాలు దూసుకొస్తున్నారు

By:  Tupaki Desk   |   30 Sep 2015 6:21 AM GMT
చెన్న‌య్ చంద్రాలు దూసుకొస్తున్నారు
X
స్టార్ హీరోయిన్‌ లు త్రిష‌ - న‌య‌న్‌ - అమ‌లాపాల్‌ హ‌వా టాలీవుడ్‌ లో త‌గ్గిపోయిన‌ట్టే. ఈ భామ‌లంతా తెలుగు సినిమాల‌కు కామా పెట్టేయ‌డంతో ఆ స్పేస్‌ ని ఫిల్ చేస్తూ కొత్త భామ‌లు దూసుకొస్తున్నారు. త్రిష - అమ‌లాపాల్‌ బాట‌లో ఇప్పుడు రెజీన చెన్న‌య్ చంద్రంగా స్టార్ హీరోయిన్‌ గా వెలిగిపోతోంది. వ‌రుస‌గా స్టార్‌ ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ రేసులోకి దూసుకొచ్చేస్తోంది.

ఇప్పుడు చెన్న‌య్ నుంచి మ‌రో కొత్త భామ దూసుకొస్తోంది. పేరు నివేద థామ‌స్ ఈ అమ్మ‌డు ఇప్ప‌టికే శ‌ర్వానంద్‌ - న‌వీన్‌ చంద్ర హీరోలుగా న‌టిస్తున్న సినిమాలో అవ‌కాశం అందుకుంది. ఆ న్యూస్ ప్ర‌చారంలో ఉండ‌గానే నాని స‌ర‌స‌న ఓ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ అందుకుంది అంటూ ప్ర‌చారం సాగుతోంది. నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంద‌ని చెబుతున్నారు.

నివేద థామ‌స్ ఇటీవ‌లి కాలంలో కోలీవుడ్‌ లో పాపుల‌ర్ హీరోయిన్‌ గా వెలిగిపోతోంది. విజ‌య్ జిల్లా సినిమాలో చ‌క్క‌ని అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు క‌మ‌ల్‌ హాస‌న్ పాప‌నాశం సినిమాలోనూ నాయిక‌గా న‌టించింది. ఈ సినిమాల‌తో కోలీవుడ్‌ లో ఈ పేరు పాపుల‌ర్ అయపోయింది. ఇప్పుడు నెమ్మ‌దిగా టాలీవుడ్‌ లోనూ తొలి అడుగులు వేస్తోంది. స్టార్ హీరోయిన్‌ లు ఒక్కొక్క‌రుగా వెళుతుంటే న‌వ‌త‌రం నాయిక‌లు ఒక్కొక్క‌రుగా యాడ్ అవుతున్నారు. ఈ వెల్ల‌వ‌లో నివేద నిరూపించుకుని దూసుకెళ్తుందేమో చూడాలి.