Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కూడా ఫేవ‌రెట్ అంటోంది

By:  Tupaki Desk   |   11 July 2017 7:12 AM GMT
ఎన్టీఆర్ కూడా ఫేవ‌రెట్ అంటోంది
X
ఎవ‌రితో క‌లిసి న‌టిస్తే వాళ్ల‌కి అభిమానిగా మారిపోతున్న‌ట్టుంది నివేదా థామ‌స్‌. ఈమె దృశ్యం త‌మిళ రీమేక్ `పాప‌నాశం`లో క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి న‌టించింది. అప్ప‌ట్నుంచి క‌మ‌ల్‌సార్ నా ఫేవ‌రేట్ అంటూ చెప్పుకొస్తోంది. ఆ త‌ర్వాత నానితో క‌లిసి జెంటిల్‌మేన్‌లో న‌టించింది. ఆ సినిమా చేసేట‌ప్పుడే నాని నా ఫేవ‌రేట్ హీరో అని చెప్పుకొచ్చింది. ఇందులో న‌టించేట‌ప్పుడే ఫేవ‌రేట్ అయ్యారా అంటే మాత్రం, కాదు అంత‌కుముందు నుంచే నాని సినిమాలు చూస్తున్నా అని సెల‌విచ్చింది.

త‌న ఫేవ‌రేట్ హీరోతో క‌లిసి ఇటీవ‌ల రెండో సినిమాలో కూడా న‌టించింది. అదే... `నిన్ను కోరి`. ఆ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది. ముఖ్యంగా నివేదా న‌ట‌న‌కి, ఆమె అందానికి అదిరిపోయే మార్కులు ప‌డిపోయాయి. ఇప్పుడు ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న అమ్మ‌డు ప్యాన్స్‌ తో సోషల్‌ నెట్వ‌ర్కింగ్ సైట్ల‌లో మాటా మంతీ జ‌రుపుతోంది. ఈ సంద‌ర్భంగా ఆమె మ‌రోసారి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డించింది.

ఎన్టీఆర్ నాకు మ‌రో ఫేవ‌రేట్ హీరో అని చెప్పుకొచ్చింది. జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టిస్తోంది నివేదా. అయితే ఆ సినిమాకి సంబంధించిన విష‌యాల్ని మాత్రం అస్స‌లు బ‌య‌ట పెట్ట‌డం లేదు.ఆ సినిమా క‌బుర్లు చెప్పుకోవ‌డానికి చాలా స‌మ‌యం ఉంద‌ని ఏ ప్ర‌శ్న అడిగినా దాట‌వేస్తోంది. అన్న‌ట్టు ఈమె ఫేవ‌రేట్ హీరోల జాబితా ఎన్టీఆర్‌ తో ఆగిపోతుందా లేదంటే మ‌ళ్లీ ఎవ‌రితోనైనా క‌లిసి న‌టించాక వాళ్లు కూడా నా ఫేవ‌రేట్ హీరోలే అని చెబుతుందేమో చూడాలి.