Begin typing your search above and press return to search.

అప్పుడు అశిన్ .. ఇప్పుడు నిత్య

By:  Tupaki Desk   |   22 Dec 2015 9:38 AM IST
అప్పుడు అశిన్ .. ఇప్పుడు నిత్య
X
అందంతోనే కాక అభినయంతోకూడా అభిమానులను సంపాదించుకున్న భామ నిత్యామీనన్.,.. పరభాషా నటి అయినా తొలి చిత్రంనుండీ తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం, కష్టతరమైన రోల్స్ ని ఒప్పుకోవడం, గ్లామరస్ పాత్రలకు దూరంగా వుండడం ఇవన్నీ నిత్య కెరీర్ ని స్పెషల్ గా సెట్ చేసాయి.

ఈ ఏడాది లారెన్స్ మునీ సిరీస్ 'గంగ'లో అంగవైకల్యం కలిగిన పాత్రలో కనిపించి ప్రశంసలను అందుకున్న నిత్య ప్రస్తుతం కన్నడ - తమిళద్విభాషా చిత్రంలో నటిస్తుంది. కఎ.ఎస్ రవికుమార్ దర్శకుడు. కిచ్చా సుదీప్ హీరో. అయితే ఈ సినిమాలో హీరోపై కాకుండా నిత్యాపై ఇంట్రడక్షన్ సాంగ్ ని చిత్రీకరించడం విశేషం.

గతంలో గజిని సినిమాలో రహతుల పాట - ఘర్షణ సినిమాలో ఏ చిలిపి కళ్ళలో పాట ఈ కోవకే చెందుతాయి. హీరోపై కాకుండా హీరోయిన్ పై పూర్తి పాటను చిత్రీకరించడం కాస్త అరుదు. ఈ క్రమంలో ఆశిన్ తరువాత ఆ ఛాన్స్ నిత్య కొట్టేసిందన్నమాట.