Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   11 April 2019 11:50 AM IST
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?
X
రామ్ చరణ్ కు గాయం కాకపోయి ఉంటే ఆర్ ఆర్ ఆర్ కీలకమైన షెడ్యూల్ ఇప్పుడు జరుగుతూ ఉండేది. అనూహ్యంగా మూడు వారాలు గ్యాప్ దొరకడంతో టెక్నీకల్ టీమ్ సంగతేమో కానీ యాక్టర్స్ అందరూ హైదరాబాద్ వచ్చేసి సరదాగా గడిపేస్తున్నారు. డైసి తప్పుకున్నాక తారక్ కు జోడిని సెట్ చేయడం పెద్ద సవాల్ గా నిలిచినట్టు సమాచారం. టైం తక్కువగా ఉండటం అనుకున్న ఒకరిద్దరు బాలీవుడ్ లో బిజీగా ఉండటం డేట్లు
ఇవ్వలేని పరిస్థితి లాంటి కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి.

శ్రద్ధా కపూర్ - జాన్వీ కపూర్ అని ఏవో ఆప్షన్లు వినిపిస్తున్నాయి కాని అవి కార్యరూపం దాల్చేలా లేవు. తాజాగా వచ్చిన అప్ డేట్ ఒకటి ఫాన్స్ ని ఫ్యాన్స్ ని టెన్షన్ లో పెడుతోంది. దాని ప్రకారం తారక్ కోసం నిత్య మీనన్ ని పరిశీలిస్తున్నారట. నిజానికి నిత్య గొప్ప యాక్టర్ అయినప్పటికీ ఇప్పుడు స్టార్ హీరోల సరసన జోడిగా సెట్ అవ్వదు. పైగా జనతా గ్యారేజ్ లో సెకండ్ హీరొయిన్ గా చేసింది. సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రల్లోనూ మెప్పించింది. ఎందులోనూ తను హీరో పక్కన జోడి కాదు.

మరి ఆర్ ఆర్ ఆర్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో యంగ్ టైగర్ సరసన తనను తీసుకుంటే అభిమానుల్లో అసంతృప్తి రేగే అవకాశం ఉంది. అయితే యూనిట్ నుంచి వస్తున్న సమాచారం మేరకు నిత్య పరిశీలనలో ఉన్న మాట నిజమే కాని జూనియర్ పక్కన మాత్రం కాదట. స్వతంత్ర సమరయోధురాలిగా ఏదో పవర్ పుల్ పాత్ర ఆఫర్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలి అంటే రాజమౌళి స్పందిస్తేనే బెటర్