Begin typing your search above and press return to search.

ఇంత‌కీ ఈ 'నైట్రో స్టార్‌' అంటే ఏంటీ?

By:  Tupaki Desk   |   11 May 2022 4:33 AM GMT
ఇంత‌కీ ఈ నైట్రో స్టార్‌ అంటే ఏంటీ?
X
త‌మ అభిమాన స్టార్ కి ఏదో ఒక బిరుదు క‌ట్ట‌బెట్టే ట్రెండ్ గ‌తంలో ఉండేది. అభిమానులు నిర్మాత‌లు ఈ విష‌యంలో ఉవ్విళ్లూరేవారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో సుప్రీంహీరో అయ్యారు. మెగాస్టార్ అన్న బిరుదును ఇచ్చింది నిర్మాత కె.ఎస్.రామారావు. అప్పట్లోనే ఆయ‌న చిరంజీవితో ఛాలెంజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తీసారు. యువ‌ర‌త్న .. న‌ట‌సింహా అంటూ అభిమానులే బాల‌య్య‌ను పిలుచుకోగా యువ‌సామ్రాట్ అంటూ నాగార్జున‌ను అక్కినేని అభిమానులు పిలిచారు. ఇక మ‌హేష్ లాంటి అగ్ర‌హీరోని సూప‌ర్ స్టార్ వార‌సుడిగా మ‌రో సూప‌ర్ స్టార్ అంటూ పిలిచారు. అత‌డి స్టార్ డ‌మ్ రేంజు కూడా అలా ఉంద‌ని నిరూప‌ణ అయ్యింది.

అయితే ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ మారింది. కొంద‌రు హీరోలు త‌మ‌ను తాము ఫ‌లానా బిరుదుతో పిలిచేసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ర‌క‌ర‌కాలుగా సోష‌ల్ మీడియాలో డిబేట్ సాగుతోంది. ఇంత‌కుముందు బ‌న్నీకి స‌డెన్ గా ఐకాన్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చారు. అది అభిమానులు ఇచ్చిన‌ది కాదు.. అంటూ చ‌ర్చ సాగింది. స్టైలిష్ స్టార్ ని స‌డెన్ గా అలా మార్చి పిల‌వాలంటే కొంత ఇబ్బంది ఏర్ప‌డింది.

ఇప్పుడు ఉన్న‌ట్టుండి సుధీర్ బాబును కూడా నైట్రో స్టార్ అంటూ పిలిచేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అస‌లు నైట్రో స్టార్ అంటే ఏంటీ? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ ఈ బిరుదు ఎవ‌రిచ్చారు? అన్న సందేహం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలో ఫ్యాన్స్ విశ్లేష‌కులు చిత్ర‌బృందం నుంచి ఇలాంటి బిరుదులు ద‌క్కేవి. ఇప్పుడు ఎందుకు బిరుదు ఇస్తున్నారో అర్థం కావ‌డంలేదు.. సుధీర్ బాబు విష‌యంలోనూ ఇలాంటి డౌట్ క్రియేట్ చేసారు.

అయితే ఈ నైట్రో స్టార్ అనేది సుధీర్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల దృష్ట్యా క్రియేట్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌ర్త్ డే కాల్స్ ఫ‌ర్ సెల‌బ్రేష‌న్ అండ్ ట్రాన్ష్ ఫ‌ర్మేష‌న్ అంటూ హంగామా మొద‌లైంది. మా హీరో నైట్రో గా మారుతున్నారు... అంటూ స్టార్ సింబ‌ల్ తో ఈమోజీల్ని షేర్ చేసారు. ఈరోజు 11.3 గంట‌ల నుంచి వేడుక‌లు సాగ‌నున్నాయి. సుధీర్ బాబు న‌టిస్తున్న 15వ సినిమా టైటిల్ ని ఫ‌స్ట్ లుక్ ని లాంచ్ చేస్తున్నాం అంటూ ప్ర‌క‌టించారు. హ‌ర్ష ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. నారాయ‌ణ దాస్ కే నారంగ్ - పుష్క‌ర్ రామ్మోహ‌న్-SVCLLP సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. #HBDSudheerBabu ..#NitroStarSudheerBabu అంటూ అభిమానులు హ్యాష్ ట్యాగుల్ని వైర‌ల్ చేస్తున్నారు.

ఒక్క ఫ్లాప్ త‌ర్వాత అంతా మార్చాడు!'వీ' చిత్రం ఫ్లాపైనా సుధీర్ బాబుకి శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ కొంచెం రిలీఫ్ నిచ్చింది. ఈ రెండు చిత్రాల్లో సుధీర్ బాబు న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. మునుముందు త‌న స్టార్ డ‌మ్ ని విస్త‌రించే ప‌నిలో సుధీర్ బాబు బిజీగా ఉన్నాడు. అత‌డు న‌టిస్తున్న 15వ చిత్రం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఇటీవ‌ల‌ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కి ర‌చ‌యిత కం న‌టుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ ..పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొంత‌కాలం క్రిత‌మే ప్రారంభమైంది. ఇంత‌లోనే టీమ్ టైటిల్ లాంచ్ కి రెడీ అయ్యింది.

చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సీనియ‌ర్ అయిన‌ పీజీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్ గా కొన‌సాగుతున‌నారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలను త‌దుప‌రి వెల్లడించ‌నున్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి... పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ లోనూ సుధీర్ బాబు న‌టిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అత‌డు న‌టించిన సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి.