Begin typing your search above and press return to search.

నితిన్ - షాలిని మెహందీలో షాడో లేడీ?

By:  Tupaki Desk   |   26 July 2020 6:11 AM GMT
నితిన్ - షాలిని మెహందీలో షాడో లేడీ?
X
యూత్ స్టార్ నితిన్ తాను ప్రేమించిన షాలినిని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ పాత బ‌స్తీలో తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో నేడు ఈ జంట వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. త్రివిక్ర‌మ్ హాజ‌రుకానున్నారు. గ‌త వారం రోజులుగా నితిన్ రెడ్డి ఇంట పెళ్లి సంబ‌రాలు పీక్స్ కి చేరుకున్న సంగ‌తి విధిత‌మే. ఈ ముచ్చ‌టైన జంట మెహందీ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు తాజాగా సోష‌ల్ మీడియాల్లో రిలీజ‌‌య్యాయి.

వేడుక ఆద్యంతం ఎంతో క్రియేటివ్ గా సాగింద‌ని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. వీటిలో నితిన్ వేష‌ధార‌ణ స‌హా వ‌ధువు గెట‌ప్ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ప్ర‌తిదీ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తున్నాయి. ఇక వీళ్ల‌తో పాటు అతిథుల్లో మ‌రో స్పెష‌ల్ అతిథి అయితే క‌ళ్లు తిప్పుకోనివ్వ‌డం లేదు. ఇంత‌కీ ఎవ‌రా షాడో ఉమెన్ అంటే... పేరు కోన నీర‌జ‌.

టాలీవుడ్ ఫేమ‌స్ రైట‌ర్ కోన వెంక‌ట్ సోద‌రి కోన నీర‌జ‌. ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్ కం లుక్ డిజైన‌ర్. నితిన్ కి ఎంతో క్లోజ్. త‌న సినిమాల‌కు డిజైన‌ర్ గా ప‌ని చేశారు. ఓ స్పెష‌ల్ ఫోటోలో పెళ్లి కూతురుతో క‌లిసి కోన నీర‌జ మెహందీ డిజైన్ ని చూపిస్తున్న ఫోటో సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల‌న్నీ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా మారాయి.