Begin typing your search above and press return to search.

నితిన్ మాసీవ్ లుక్ అదిరింది..క‌లెక్ట‌ర్ సాబ్ వ‌చ్చేశాడు

By:  Tupaki Desk   |   26 March 2022 6:14 AM GMT
నితిన్ మాసీవ్ లుక్ అదిరింది..క‌లెక్ట‌ర్ సాబ్ వ‌చ్చేశాడు
X
విభిన్న‌మైన చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్న హీరో నితిన్‌. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `మాచర్ల నియోజ‌క వ‌ర్గం`. మాసీవ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ద్వారా ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈమూవీని శ్రేష్ట్ మూవీస్‌, ఆదిత్య మూవీస్‌, అండ్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ల‌పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల నితిన్ ప్రీ లుక్ ని విడుద‌ల చేసిన చిత్ర బృందం సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. తాజాగా శ‌నివారం నితిన్ లుక్ ని విడుద‌ల చేసింది. ఇందులో నితిన్ గుంటురు క‌లెక్ట‌ర్ గా సిద్దార్ధ రెడ్డి అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. నితిన్ తాజాగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా నితిన్ మాసీవ్ లుక్ లో క‌నిపిస్తున్నారు. ర‌ఫ్‌ లుక్ , మీస క‌ట్టు.. తీక్ష‌ణంగా చూస్తున్న తీరు.. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో నితిన్ క‌నిపిస్తున్నతీరు ఆక‌ట్టుకుంటోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట్ ని చూస్తుంటే ఓ కీల‌క ఘ‌ట్టానికి సంబంధించిన ఫైట్ నేప‌థ్యానిదిగా తెలుస్తోంది.

నితిన్ సీరియ‌స్ గా కూర్చుని చూస్తుంటే చుట్టూ క‌త్తుల‌తో పులివేష‌గాళ్లు చేర‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్న నితిన్ ఈ పోస్ట‌ర్ కు ఆస‌క్తిక‌ర‌మైన వాక్యాల‌ను కూడా జ‌త చేశారు. మీకు న‌చ్చే మీరు మెచ్చే మాస్ తో వ‌స్తున్నా` అంటూ సినిమా ఎలా వుండ‌బోతోందో చిన్న హింట్ ఇచ్చేశారు. ఫ‌స్ట్ ఛార్జ్ పేరుతో నితిన్ ఫ‌స్ట్ లుక్ ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.

ఇటీవ‌లే నితిన్ పాల్గొన‌గా కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రంలోని యాక్ష‌న్ సీక్వెన్స్ ని టాప్ ఫైట్ మాస్ట‌ర్స్ అన‌ల్ - అర‌సు తెర‌కెక్కిస్తున్నారు. సినిమాలో వీరు కంపోజ్ చేసిన పోరాట ఘ‌ట్టాలు ఈ మూవీకి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు. సినిమా కాన్సెప్ట్ కి త‌గ్గ‌ట్టుగానే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని ప్లాన్ చేస్తూ వెళుతున్నారు ద‌ర్శ‌కుడు ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర్.

ఈ చిత్రంలో నితిన్ తొలి సారి క‌లెక్ట‌ర్ గా న‌టిస్తుండ‌టంతో ఫ‌స్ట్ ఛార్జ్ అంటూ ఫ‌స్ట్ లుక్ ని ఈ శ‌నివారం విడుద‌ల చేశారు. ఇందు కోసం వినూత్నంగా గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్ త‌ర‌హాలో ఓ లెట‌ర్ ని విడుద‌ల చేసి ఇందులోనే సినిమాలో నితిన్ క్యారెక్ట‌ర్ ని, అత‌ని పేరుని ప‌రిచ‌యం చేసి ఆక‌ట్టుకున్నారు.

ఫ‌స్ట్ లుక్ కూడా చాలా కొత్త‌గా వుంది. నితిన్ క‌నిపిస్తున్న తీరు కూడా సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. కంప్లీట్ మాసీవ్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీకి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. కోట‌గిరి వెంక‌టేశ్వ‌రరావు ఎడిటింగ్‌, అన‌ల్ - అర‌సు ఫైట్స్, ప్ర‌సాద్ మూరెళ్ల కెమెరా, సాహి సురేష్ ఆర్ట్, మామిడాలా తిరుప‌తి డైలాగ్స్ అదిస్తున్నారు.