Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' స్నీక్ పీక్: అంధుడైన పియానో ప్లేయర్ గా ఆకట్టుకుంటున్న నితిన్‌..!

By:  Tupaki Desk   |   30 Aug 2021 6:21 AM GMT
మాస్ట్రో స్నీక్ పీక్: అంధుడైన పియానో ప్లేయర్ గా ఆకట్టుకుంటున్న నితిన్‌..!
X
యూత్ స్టార్ నితిన్‌ - నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ''మాస్ట్రో''. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌ స్టార్‌ వేదికగా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా మాస్ట్రో స్నీక్ పీక్ ని వదిలారు.

'మాస్ట్రో' స్నీక్ పీక్ లో నితిన్.. పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నాడు. అయితే అతనికి కళ్ళు కనపడవని తెలుస్తోంది. అంధుడైన నితిన్ ఓ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేస్తుండగా.. పియానో వర్క్ చేయడం మానేస్తుంది. 'ట్యూన్ అవడం లేదు.. ఈ పియానో కూడా పని చేయడం లేదు' అంటూ తన చేతికి ఉన్న వాచ్ లో టైం చెక్ చేసుకుంటున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. ఇందులో అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని అర్థం అవుతోంది.

కాగా, హిందీలో విజయవంతమైన 'అంధాధున్‌' చిత్రానికి రీమేక్‌ గా ''మాస్ట్రో'' సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ - ట్రైలర్‌ - సాంగ్స్ సినిమాపై అంచనాలను కలిగించాయి. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ ఏడాది 'చెక్' 'రంగ్ దే' చిత్రాలతో పలకరించిన నితిన్.. 'మాస్ట్రో' తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.