Begin typing your search above and press return to search.

నిత్యామీనన్‌ను కష్టపెట్టిన సినిమా ఇదే

By:  Tupaki Desk   |   13 April 2015 1:30 PM GMT
నిత్యామీనన్‌ను కష్టపెట్టిన సినిమా ఇదే
X
చూడగానే నటన పుట్టుకతోనే అబ్బేసిందా అనిపించే నటులు కొంతమందే ఉంటారు. నిత్యామీనన్‌ను చూస్తే అలాగే అనిపిస్తుంది. తెరమీద నటిస్తున్నట్లు కాకుండా నిజంగానే ఓ వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నిత్యమీనన్‌ను నటన చూస్తే. తెలుగులోనే కాదు.. మిగతా భాషలన్నింట్లోనూ కూడా నిత్యకు మంచి పేరే ఉంది.

మరి ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావు.. ఎక్కడైనా శిక్షణ తీసుకున్నావా అని నిత్యను అడిగితే.. ''శిక్షణ తీసుకుంటేనో, సినిమాలు చూస్తేనో నటన రాదని నా అభిప్రాయం. అందుకే ఇప్పటివరకూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నాలో ఆసక్తి ఉండి సహజంగా అదలా వచ్చేసింది. ఒకవేళ శిక్షణ తీసుకుని ఉంటే సహజంగా నటిస్తానన్న పేరే వచ్చేది కాదేమో'' అని చెప్పింది నిత్య.

కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించానని.. ఐతే కాంఛన-2లో చేసిన పాత్ర వాటన్నింటికీ భిన్నమైందని నిత్య చెప్పింది. ఈ క్యారెక్టర్‌ కోసం అన్నిటికంటే ఎక్కువ కష్టపడ్డానని కూడా తెలిపింది. ''గంగ సినిమాలో టైటిల్‌ పాత్ర నాదే. ఆ క్యారెక్టరే కథను మలుపు తిప్పుతుంది. ఇప్పటివరకూ హార్రర్‌ చిత్రాల్లో నటించలేదు. వేరే పాత్రలతో పోలిస్తే ప్రేక్షకుల్ని భయపెట్టాల్సిన పాత్ర పోషించడం కాస్త కష్టంగానే అనిపించింది'' అని నిత్య అంది.