Begin typing your search above and press return to search.

నిత్యాకి శోభన్ బాబు బ్రేక్ ఇస్తాడా?

By:  Tupaki Desk   |   6 Dec 2015 5:30 PM GMT
నిత్యాకి శోభన్ బాబు బ్రేక్ ఇస్తాడా?
X
నిత్యా శెట్టి.. ఇలా చెబ్తే పెద్దగా తెలీకపోవచ్చు కానీ.. రాజేంద్ర ప్రసాద్ తో ఈటీవీ నిర్మించిన దాగుడుమూత దండాకోర్ లో నటించిన అమ్మాయి అంటే మాత్రం కొంతమందికి గుర్తురావడం ఖాయం. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ అవతారం ఎత్తిండి. అలా ఎలా చిత్రంతో స‌క్సెస్ సాధించిన రాహుల్ ర‌వీంద్రన్ ఇప్పుడు విప్లవ్ ద‌ర్శక‌త్వంలో శోభ‌న్‌ బాబు అనే మూవీలో టైటిల్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాలో దాగుడు మూత‌ల దండాకోర్ ఫేమ్ నిత్యా శెట్టి హీరోయిన్ గా న‌టించ‌నుంది.

నిత్యా పెర్ఫామెన్స్ విపరీతంగా నచ్చడంతో నిత్యా శెట్టిని ఈ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నట్లు డైరెక్టర్ చెబ్తున్నాడు. నిత్యాశెట్టి ప్రస్తుతం చునియా ద‌ర్శక‌త్వంలో కార్తీక్ రాజు స‌ర‌స‌న, అలాగే త‌మిళంలో ఐవ‌రాటం చిత్రంలోనూ న‌టిస్తోంది. బాలనటిగా నటించిన సినిమాలలో కొన్నే గుర్తున్నాయని, మంచి చిత్రాలు చెయ్యాలని ఆశ పడుతున్నానని ఆమె చెబుతోంది నిత్యా శెట్టి. అయిదేళ్ళ తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే.. మంచి సినిమాల్లో నటించాననే ఫీలింగ్ మిగిలిపోవాలన్నదే ఈ తెలుగమ్మాయి లక్ష్యమట. పైకి చెప్పుకోలేక పోయిన చిత్రాలు చేసేనేమిటి అనే బాధ మాత్రం మిగిలిపోకూడదని అంటోంది. గ్లామర్ చిత్రాలయినా, కమర్షియల్ చిత్రాలయినా, ఆర్ట్ ఫిలింస్ అయినా పర్లేదంట కానీ.. మొత్తం మీద మంచి చిత్రం చేసేనా లేదా అన్నదే ముఖ్యమని నిత్యా శెట్టి అంటోంది.

ఇప్పటివరకు 20కి పైగా మూవీస్ లో నటించినా ఈ పిల్లకు చెప్పుకోదగ్గ పేరు కానీ, కెరీర్ లో బ్రేక్ కానీ రాలేదు. ఇంకా చిన్నపిల్లగానే కనిపించడం, కాస్త పొట్టిగా ఉండడంతో.. అందరూ ఈమెను పక్కన పెట్టేస్తున్నారు. చూద్దాం కనీసం శోభన్ బాబు అయినా బ్రేక్ ఇస్తాడేమో.