Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ సంఘ‌ట‌న వ‌ల్ల చాలా కుంగిపోయాను

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:10 PM IST
ప్ర‌భాస్ సంఘ‌ట‌న వ‌ల్ల చాలా కుంగిపోయాను
X
నిత్యామీన‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నందినిరెడ్డి రూపొందించిన `అలా మొద‌లైంది` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన నిత్యామీన‌న్ తొలి చిత్రంతోనే న‌టిగా తానేంటో నిరూపించుకుని తెలుగు ప్రేక్ష‌కుల హీద‌యాల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.

త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల్నే ఎంచుకుంటూ హీరోయిన్‌ గా , గాయ‌నిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని క్రేజ్‌ని సొంతం చేసుకున్నారామె. కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ తెలుగులో వ‌రుస చిత్రాల్లో నిటిస్తూ బిజీగా మారిపోయింది.

ప్ర‌స్తుతం ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌` లో ఆయ‌న‌కు జోడీగా న‌టించిన నిత్యామీన‌న్ తాజాగా నిర్మాత‌గానూ మారి తొలి స‌క్సెస్‌ని సొంతం చేసుకుంది. ఆమె న‌టించిన తాజా చిత్రం `స్కైలాబ్‌`. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టించ‌డ‌మే కాకుండా ఈ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామిగా కూడా వ్య‌వ‌హ‌రించింది.

ఇటీవలే విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన నిత్యామీన‌న్ .. హీరో ప్ర‌భాస్ ఇష్యూపై షాకింగ్ కామెంట్స్ చేయ‌డం వైర‌ల్ గా మారింది.

ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ ప్రారంభంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి చెప్పుకొచ్చింది. ఇదే సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఇష్యూపై స్పందించ‌డం గ‌మ‌నార్హం. నాకు ఇండ‌స్ట్రీలో పెద్ద దెబ్బ త‌గిలింది ప్ర‌భాస్ విష‌యంలోనే.

ఆ ఇష్యూ ఇప్ప‌టికీ న‌న్ను బాధ‌పెడుతూనే వుంది. నా గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ అలా రాయ‌డంతో చాలా హ‌ర్ట్ అయ్యాను. మాన‌సికంగా చాలా కుంగిపోయాను. అలా మొద‌లైంది తెలుగులో నా తొలి చిత్రం. ఆ స‌మ‌యంలో నాకు తెలుగు స‌రిగా రాదు.

తెలుగులో అప్ప‌టి వ‌ర‌కు నేను ఏ సినిమా చూడ‌లేదు. అలాంటి స‌మ‌యంలో న‌న్ను ప్ర‌భాస్ గురించి అడిగితే అత‌నెవ‌రో తెలియ‌ద‌ని చెప్పాను. ఆ విష‌యాన్ని చాలా పెద్దిగా చిత్రీక‌రించారు.

నేను ఏదో పెద్ద త‌ప్పు చేసిన‌ట్టుగా వార్త‌ని సృష్టించారు. అప్పుడే నాకు అర్థ‌మైంది ఎప్పుడు ఎక్క‌డ ఎలా వుండాలో తెలుసుకున్నాను. మాట‌ల గార‌డీ చేస్తేనే న‌చ్చుతుంద‌ని భావించాను` అని ఆనాటి ప్ర‌భాస్ ఇష్యూని తాజాగా నిత్యామీన‌న్ బ‌య‌ట‌పెట్ట‌డం హాట్ టాపిక్‌ గా మారింది.