Begin typing your search above and press return to search.

భీమ్లా నాయక్ ను నేనేం కోరుకోలేదు.. వాళ్లే వచ్చారు

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:00 PM IST
భీమ్లా నాయక్ ను నేనేం కోరుకోలేదు.. వాళ్లే వచ్చారు
X
ఇండస్ట్రీలో నూటికి 90 శాతం మంది హీరోయిన్స్ అందం తో కెరీర్‌ లో నెట్టుకు వస్తున్నారు. అందాల ఆరబోత మరియు కాస్త రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంకు ఓకే చెప్పడం వల్ల హీరోయిన్స్‌ కెరీర్‌ లో ముందుకు సాగుతున్నారు అనడంలో సందేహం లేదు. మిగిలిన ఆ పది శాతం మంది మాత్రం అందాల ఆరబోత చేయకుండానే తమ ప్రతిభతో తమ నటన మరియు డాన్స్ ఇంకా తమ స్టైల్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

వారికి స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు రాకున్నా నటిగా.. హీరోయిన్ గా అయితే మంచి గుర్తింపు వస్తోంది. రెండవ రకం హీరోయిన్ నిత్యా మీనన్ అనడంలో సందేహం లేదు. తనకు తాను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా సినిమా ఆఫర్ అడగదట. ఆఫర్లు లేకుంటే ఊరికే అయినా ఉంటుంది కాని అవకాశం కావాలని ఏ ఒక్కరిని అడగను అంటూ మరోసారి చెప్పుకొచ్చింది.

కెరీర్ ఆరంభం అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఈ అమ్మడు కనీసం ఎక్స్ పోజింగ్‌ చేయడం.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వంటిది చేయలేదు. ఆమెకు అలాంటి అవసరం కూడా రాలేదు. మొదటి సినిమా అలా మొదలైంది తో మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంది. అలా అప్పటి నుండి అందాల ప్రదర్శణ విషయంలో ఆసక్తి చూపించకుండా కేవలం తన నటన ప్రతిభతోనే సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది.

తాజాగా ఈమె స్కైలాబ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తాను ఏ ఒక్క సినిమాను కూడా కావాలని కోరుకోలేదు. ఏదైనా పాత్రకు నేను సెట్‌ అవుతాను అనుకున్నప్పుడు మాత్రమే మేకర్స్ నా వద్దకు వస్తారు. అప్పుడు నాకు నచ్చితే నటించేందుకు సిద్దం అవుతాను అంది.

త్రివిక్రమ్‌ గారు భీమ్లా నాయక్‌ కథ అనుకున్నప్పుడే ఈ పాత్రకు నన్ను అనుకున్నారట. అందుకే ఆ పాత్ర కు నన్ను తీసుకున్నారు. ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన సినిమాల్లో నేను నటించిన పాత్రల్లో రౌడీ లా చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నా పాత్ర అలాగే ఉంటుంది. నన్ను త్రివిక్రమ్‌ గారు ఒక రౌడీ అమ్మాయిగానే చూస్తున్నారు.

నాలో ఉన్న మంచి అమ్మాయిని ఆయన చూడటం లేదు అన్నట్లుగా కామెడీ చేసింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారిది అని తాను చేయలేదు అన్నట్లుగా ఆమె ఇండైరెక్ట్‌ గా చెబుతూ ఈ సినిమాలోని పాత్ర కోసం త్రివిక్రమ్‌ గారు నన్ను అడిగారు. పాత్ర నచ్చడంతో చేశాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. పవన్‌ తో సినిమా చేయాలనే కోరికతో త్రివిక్రమ్‌ ను అడిగితే ఆయన ఈ పాత్ర ఇచ్చాడు అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఇలా నిత్యా మీనన్ కొట్టి పారేసింది.