Begin typing your search above and press return to search.
`మహానటి` ఛాన్స్ మిస్సయినా అదే బ్యానర్ లో..!
By: Tupaki Desk | 9 Nov 2020 12:00 PM ISTమహానటి లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించారు అగ్రనిర్మాత అశ్వనిదత్. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. కమర్షియల్ విజయాన్ని మించి క్రిటికల్ గా ప్రశంసలు దక్కాయి. మహానటి సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కి అమాంతం పాపులారిటీ పెరిగింది.
నిజానికి ఆ పాత్రలో నటించాల్సిందిగా మలయాళ బ్యూటీ నిత్యామీనన్ కి నాగ్ అశ్విన్ ఆఫర్ చేశారని అప్పట్లో కథనాలొచ్చాయి. కానీ అది వీలు పడకపోవడంతో కీర్తి సురేష్ ని ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారని గుసగుసలు వినిపించాయి. ఆసక్తికరంగా నిత్యా ఆ తర్వాత ఎన్బీకే `కథానాయకుడు`లో సావిత్రిగా మెరుపులు మెరిపించారు.
అయితే నిత్యా మీనన్ మహానటి నిర్మాతలతో కలిసి పనిచేయనున్నారన్నది తాజా అప్ డేట్. నిత్యా ప్రధాన పాత్రలో తెలుగు వెబ్-సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారని. దీనిని సీనియర్ నిర్మాత అశ్విని దత్ పెద్ద కుమార్తె స్వాప్నా దత్ నిర్మిస్తారని ఇటీవల కథనాలొచ్చాయి. 8-ఎపిసోడ్ వెబ్-సిరీస్ డిసెంబర్ లేదా జనవరి నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రముఖ రచయిత బలభద్రపాత్రుణి రమణి ఈ సిరీస్ కి కథను అందించారు. డెబ్యూ దర్శకుడు గోమతేష్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించనున్నారు. దర్శకనటుడు అవసరల శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించడమే గాక.. దర్శకత్వ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.