Begin typing your search above and press return to search.

మగాళ్లా.. ఏరీ.. నానికి నిత్య పంచ్

By:  Tupaki Desk   |   14 Feb 2018 1:44 PM IST
మగాళ్లా.. ఏరీ.. నానికి నిత్య పంచ్
X
నాని నిర్మాతగా నటించి.. చేపకు వాయిస్ ఇచ్చి మరీ రూపొందించిన సినిమా అ!. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఇప్పుడు ప్రచార పర్వం పీక్స్ కు వచ్చేసింది. ఏకంగా నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపించిన ఈ చిత్రం.. ముందునుంచి ఆసక్తి కలిగిస్తూనే ఉంది.

కాజల్ అగర్వాల్.. నిత్యా మీనన్.. రెజీనా కసాండ్రా.. ఈషా రెబ్బా.. ఇలా నలుగురు చక్కనమ్మలు ఒకే సినిమాలో కనిపిస్తూ అలరించబోతున్నారు. ఇప్పుడీ నలుగురు కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ ఇచ్చేశారు. ఒక్క ఫ్రేములో నలుగురు అందాల భామలు అంటే ఆ విజువల్ ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఊహించేసుకోవచ్చు. ఓ పక్కన నిర్మాతగా నాని కూచుని ఉంటే.. పక్కనే యాంకర్ తో కలిపి ఐదుగురు భామలు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. అందరూ అమ్మాయిలే అయినా.. తను అ! సినిమా కావడంతోనే స్పెషల్ వచ్చానని అన్నాడు నాని. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తరువాతే నిత్యామీనన్ ఓ నాటు జోకు పేల్చేసింది.

'ఇంతకీ ఇక్కడ మగవాళ్లు ఎవరు ఉన్నారు' అంటూ నిత్యామీనన్ అమాయకంగా అడిగేసింది. ఆ పంచ్ కు అక్కడనుంచి లేచి వెళ్లిపోయేందుకు(కామెడీగా అయినా) నాని రెడీ అయిపోతే.. 'ఏయ్ నిన్ను కాదురా.. యాక్టర్స్ గురించి చెప్పాను' అంటూ కవర్ చేసింది నాని. కానీ అమ్మాయిల మధ్యలో కూర్చుని ఉండగా.. మగవాళ్లు ఎవరున్నారు అనే పంచ్ స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకోవడం కాసింత క్లిష్టమైన విషయమే.