Begin typing your search above and press return to search.

వావ్.. నిత్య లుక్స్.. రీజన్ అదేనా?

By:  Tupaki Desk   |   14 Aug 2016 9:55 AM GMT
వావ్.. నిత్య లుక్స్.. రీజన్ అదేనా?
X
మలయాళ కుట్టి నిత్యా మీనన్ ట్యాలెంట్ ని లెక్కేయడానికి కొలతలు కూడా చాలవు. పెర్ఫామెన్స్ విషయంలో అంతటి ప్రతిభ చూపించే ఈ భామకు కొంచెం పొగరనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. నేను సైలెంగా నా పని నేను చేసుకోవడం తప్ప ఎవరినీ పలకరించను కాబట్టి.. అలా అనుకుంటారన్నది నిత్యా వాదన. ఆ సంగతేమో లుక్స్ విషయంలో నిత్యామీనన్ ఈ మధ్య స్పెషల్ కేర్ తీసుకుంటోంది.

ఎంత ట్యాలెంట్ ఉన్నా.. బాగా బొద్దుగా ఉందని.. లావు పెరుగుతోందనే కామెంట్స్ పెరిగిపోతున్నాయి. హీరోయిన్ గా సుదీర్ఘకాలం ఉండాలంటే వీటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. అలాంటి నిత్యా మీనన్ ని ఇప్పుడు పోతీస్ యాడ్ లో చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పట్టు చీరల ప్రకటనల కోసం నిత్య ఫోటో సెషన్ చేయగా.. ఆ ఫోటోలపై చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. అసలు నిత్య అంత సన్నగా ఎప్పుడు మారిపోయిందా అన్నది ఫస్ట్ డౌట్ అయితే.. హైట్ విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఏర్పడ్డాయి.

ఇంత పొడుగ్గాను.. అంత సన్నగాను.. ఇంత షార్ట్ టెర్మ్ లో మారిపోయే అవకాశాలు ఉండవు కాబట్టి.. ఇదంతా టెక్నాలజీ మహిమ అనుకుంటున్నారు చాలామంది. చూడటానికి నిత్య చాలా బొద్దుగా ఉంటుంది కాబట్టి.. ఈ ఫిగర్ అంతా ఫోటోషాప్ మహిమ అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ డౌట్స్.. కామెంట్స్ సంగతేమో కానీ.. నిత్య మాత్రం భలే మెరిసిపోయిందిలే. నిత్యామీనన్ వీరాభిమానుల కలెక్షన్ లో మరికొన్ని పర్మినెంట్ ఫోటోలు యాడ్ అయిపోవడం మాత్రం ఖాయమే.