Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: షిఫాన్ గౌనులో నిత్యా న‌వ‌వ‌ధువులా!!

By:  Tupaki Desk   |   26 April 2021 3:30 PM GMT
ఫోటో స్టోరి: షిఫాన్ గౌనులో నిత్యా న‌వ‌వ‌ధువులా!!
X
ట్యాలెంటెడ్ నిత్యామీన‌న్ ఇంత‌కీ ఏమైంది? ఇటీవ‌ల తెలుగు చిత్ర‌సీమ‌లో ఈ అమ్మ‌డి సందడి పెద్ద‌గా క‌నిపించ‌దేం? అంటే.. ఇదిగో ఇదే స‌మాధానం.

చివ‌రిసారిగా తమిళ అనువాదం `సైకో`లో క‌నిపించిన నిత్యామీన‌న్.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప‌లు వెబ్ ఆంథాల‌జీలు సినిమాల‌తో బిజీగానే ఉంది. తెలుగు లోగిళ్ల‌లో జూనియ‌ర్ సౌంద‌ర్య గా వెలిగిపోయిన నిత్యా ఎందుక‌నో సడెన్ గా ఈ ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలి త‌మిళం మ‌ల‌యాళం వైపు దృష్టి సారించింది. 2021లో `నిన్నిలా నిన్నిలా` అనే తెలుగు చిత్రంతో అభిమానుల‌ ముందుకు వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

`గ‌మ‌నం` అనే తెలుగు ఆంథాల‌జీలో శైలాపుత్రిదేవిగా న‌టిస్తోంది నిత్యా. ఇందులో అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అలాగే మ‌ల‌యాళంలో అరుంధ‌తి (కోలాంబి -మ‌ల‌యాళం) అనే చిత్రంలోనూ నిత్యా న‌టిస్తోంది. ఇందు వీఎస్ ద‌ర్శ‌క‌త్వంలో సేతుప‌తి స‌ర‌స‌న నిత్యా మీన‌న్ ఓ చిత్రంలో న‌టిస్తోంది. ఇది విజ‌య్ సేతుప‌తికి రెండో మ‌ల‌యాళ సినిమా.

ఈ క్రైసిస్ సీజ‌న్ లో అడ‌పాద‌డ‌పా ఫోటోషూట్లతోనూ నిత్యా అభిమానుల ముందుకు వ‌స్తోంది. తాజాగా వ‌ధువు ధ‌రించే బ్రైడ‌ల్ షిఫాన్ తళుకుబెళుకుల డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించింది. క‌ర్లీ హెయిర్ తో వింటేజ్ స్టైల్లో నిత్యా ఇచ్చిన ఆ ఫోజు అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతోంది.