Begin typing your search above and press return to search.

నితిన్ (Vs) అఖిల్.. 2021 సంక్రాంతి ఫైట్

By:  Tupaki Desk   |   30 July 2020 10:30 AM IST
నితిన్ (Vs) అఖిల్.. 2021 సంక్రాంతి ఫైట్
X
సంక్రాంతి పుంజులు అన‌గానే చిరంజీవి- బాల‌కృష్ణ‌.. మ‌హేష్‌- ప‌వ‌న్ క‌ల్యాణ్‌... చ‌ర‌ణ్ - మ‌హేష్ .. ఇలా కొంద‌రి మ‌ధ్య పోటీ వేడెక్కించేది. 2020 సంక్రాంతికి మ‌హేష్ - బ‌న్ని పోటీప‌డ్డారు. ఈ పోటీలో బ‌న్ని న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంపై పై చేయి సాధించి క్లీన్ హిట్ కొట్టింది. ఇండ‌స్ట్రీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టింది. ప్ర‌తి సంక్రాంతికి చిన్న సినిమా కానీ డ‌బ్బింగ్ సినిమా కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమాల‌తో పోటీప‌డుతూనే ఉన్నాయి.

ఆ సంగ‌తేమో కానీ..2021 సంక్రాంతికి పోటీలో దిగే పుంజులేవీ? అంటే ఈసారి యంగ్ హీరోలే బ‌రిలో దిగే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందునా నితిన్ వ‌ర్సెస్ అఖిల్ పోటీని ఖాయం చేస్తున్నారు. ఇద్ద‌రు ఫ్రెండ్స్ మ‌ధ్య పోటీ అంటూ ఆసక్తిక‌ర ముచ్చ‌ట సాగుతోంది. తాజా సీన్ చూస్తుంటే అగ్ర హీరోలెవ‌రూ సంక్రాంతికి వ‌చ్చే సీన్ క‌నిపించ‌డం లేదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న వ‌కీల్ సాబ్ సంక్రాంతికి వ‌స్తుంద‌ని భావించారు. కానీ మ‌హ‌మ్మారీ లాక్ డౌన్ వ‌ల్ల .. ప‌వ‌న్ ధీక్ష వ‌ల్ల ఈ మూవీ షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతోంది. 2021 సంక్రాంతికి క‌ష్ట‌మేన‌న్న మాటా వినిపిస్తోంది. చిరంజీవి- బాల‌య్య‌- వెంక‌టేష్ .. వీళ్ల సినిమాలేవీ సంక్రాంతి ద‌రిదాపుల్లో వ‌చ్చే ఛాన్సే లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక మీడియం బడ్జెట్ సినిమాలు చూస్తే నితిన్ .. అఖిల్ సినిమాలు వ‌చ్చే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నితిన్ `రంగ్ దే` ఏడాది చివరి నాటికి చిత్రీకరణను పూర్తి చేసి 2021 సంక్రాంతి కి వ‌చ్చే వీలుంద‌ట‌. అలాగే అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కూడా సంక్రాంతి బ‌రిలోనే దిగే వీలుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. బ్యాలెన్స్ షూటింగులు పూర్తి చేసుకుని చ‌టుక్కున సంక్రాంతి బ‌రిలో దిగిపోతార‌ట‌.

అయితే ద‌స‌రా బ‌రిలో ఉప్పెన‌- రెడ్ - నిశ్శ‌బ్ధం- క్రాక్ ఇవ‌న్నీ రిలీజైపోతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. వీటిలో ఏదైనా వాయిదా ప‌డినా క్రిస్మ‌స్ లేదా సంక్రాంతికి వ‌చ్చే ఛాన్సుంటుందేమో! ప్ర‌భాస్ రాధేశ్యామ్.. విజ‌య్ మాస్టార్ .. ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా ఏదైనా సంక్రాంతికి వ‌స్తుందా? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ క్లారిటీ రాలేదు. ఏవైనా కొత్త ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయేమో చూడాలి.