Begin typing your search above and press return to search.

నితిన్ సినిమా.. వాట్ హ్యాపెనింగ్..!

By:  Tupaki Desk   |   11 March 2023 6:00 AM
నితిన్ సినిమా.. వాట్ హ్యాపెనింగ్..!
X
లవర్ బాయ్ నితిన్ భీష్మతో మళ్లీ తన మార్క్ హిట్ అందుకోగా ఇక మీదట కెరీర్ లో అదే దూకుడు చూపిస్తాడని అనుకోగా మాచర్ల నియోజకవర్గం సినిమా రిజల్ట్ షాక్ ఇచ్చింది. ఆ సినిమా థియేట్రికల్ లో కాదు అన్ని ఫ్లాట్ ఫాం ల మీద ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ లో మూవీ ప్లాన్ చేశారు నితిన్. మారేడుమిల్లి లో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. మరి ఏమైందో ఏమో నెక్స్ట్ షెడ్యూల్ విషయంలో చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న నితిన్ ఏమాత్రం తొందర పడకూడదని ఫిక్స్ అయ్యాడు.

రైటర్ గా సూపర్ హిట్లు అందుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా నా పేరు సూర్య ఫ్లాప్ అవడంతో కెరీర్ రిస్క్ లో పడింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ సినిమా పోవడం వల్ల వంశీకి ఛాన్స్ లు లేకుండా అయిపోయింది.

అయితే నితిన్ కి కథ చెప్పగా ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమాకు కావాల్సిన బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని అందుకే తొందర పడకుండా ప్లాన్ చేస్తున్నారట.

అటు నితిన్ కి.. ఇటు డైరెక్టర్ గా వక్కంతం వంశీకి ఇద్దరికి ఈ సినిమా హిట్ కంపల్సరీ. డైరెక్టర్ గా తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అనిపించుకున్న వక్కంతం వంశీ సెకండ్ సినిమా హిట్టు పడితేనే మరో సినిమా ఛాన్స్ వస్తుంది. ఇక నితిన్ కూడా మిగతా యువ హీరోలంతా కూడా వరుస హిట్లతో దూసుకెళ్తుంటే నితిన్ మాత్రం ఒక్క హిట్టు రెండు మూడు ఫ్లాపులు అన్నట్టుగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. కంటిన్యూగా హిట్ సినిమాలను అందించడంలో ఫెయిల్ అవుతున్నాడు నితిన్.

అందుకే ఇక మీదట కథల విషయంలో మరింత జాగ్రత్త పడాలని ఫిక్స్ అయ్యారట. వక్కంతం వంశీ సినిమా లేట్ అవడానికి కారణం కూడా సినిమాను ఇంకా బాగా చెక్కుతున్నారని టాక్. మరి నితిన్ కి ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.