Begin typing your search above and press return to search.
నితిన్-యేలేటి సినిమాలో ఆ బ్యూటీకి ఛాన్స్
By: Tupaki Desk | 30 Sept 2019 8:00 PM ISTహీరో నితిన్ హీరోగా నటించిన సినిమా ఈ ఏడాదిలో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు కానీ ఆ గ్యాప్ ను కవర్ చేసేందుకు అన్నట్టుగా చాలా సినిమాలనే లైన్లో పెట్టాడు. ఒక వైపు 'భీష్మ' షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కాకుండా కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా.. వెంకీ అట్లూరితో ఇంకో సినిమా కూడా లైన్లో ఉన్నాయి. వీటితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కే మరో సినిమా కూడా క్యూలో ఉంది.
'భీష్మ' షూటింగ్ పూర్తి కాగానే చంద్రశేఖర్ యేలేటి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కొత్త భామ సిమ్రాన్ చౌదరిని ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాను జూన్ లో లాంచ్ చేసిన సమయంలో రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియా వారియర్ ను హీరోయిన్లుగా ప్రకటించారు. మరి సిమ్రాన్ చౌదరిని మూడవ హీరోయిన్ గా ఎంపిక చేశారా లేదా.. రకుల్ ప్రియాలలో ఒకరి బదులుగా తీసుకున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
సిమ్రాన్ చౌదరి విషయానికి వస్తే 'హమ్ తుమ్' అనే సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో నటించింది. నితిన్ - యేలేటి సినిమా సిమ్రన్ కు సూపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఒక తెలుగు అమ్మాయికి హీరోయిన్ గా అవకాశం లభించడం మాత్రం గొప్ప విషయమే.