Begin typing your search above and press return to search.

నితిన్.. డిజాస్టర్స్ వచ్చినా ఛాన్సులు తగ్గట్లేదు!

By:  Tupaki Desk   |   30 Aug 2022 4:28 AM GMT
నితిన్.. డిజాస్టర్స్ వచ్చినా ఛాన్సులు తగ్గట్లేదు!
X
టాలీవుడ్ సీనియర్ యంగ్ హీరో నితిన్ అదృష్టం ఏమిటో గాని అతని కెరీర్లో ఎన్నో అపజయాలు ఎదురైనా కూడా మళ్లీ ఏదో ఒక సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటాడు. అతని కెరీర్ లో ఇంతవరకు నటనకు మంచి స్కోప్ ఉన్న సినిమా అయితే పడింది లేదు. ఏదైనా ప్రయోగాత్మకమైన సినిమాతో సక్సెస్ అందుకున్నాడు అంటే అది లేదు.

కేవలం కమర్షియల్ హిట్స్ తోనే నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కు కుంటున్నాడు. అది కూడా అతని రేంజ్ ను అంతగా పెంచింది లేదు. అప్పుడు ఎప్పుడో వచ్చిన అఆ సినిమా తప్పితే నితిన్ రేంజ్ ని మార్చేసే సినిమా ఏది పడలేదు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా నితిన్ దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవల మాత్రం అతనికి ఎదురైనా పరాభవాలు మాత్రం మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయ్యేలా చేశాయి.

భీష్మ సినిమా తర్వాత ఏ సినిమా కూడా వర్కౌట్ కాలేదు ఇటీవల వచ్చిన మాచర్ల నియోజకవర్గం అయితే ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టింది. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్లో నిర్మించిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా నితిన్ మరో రెండు కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. ఇక భీష్మ దర్శకుడితో కూడా మరోసారి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.

అదే తరహాలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్రతో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ సినిమాతో సక్సెస్ అయితే అందుకున్నాడు కానీ త్రివిక్రమ్ ఉండడం వలన అనుకున్నంతగా గుర్తింపు రాలేదు.

దీంతో అతను తదుపరి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజీ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక నితిన్ కూడా అతన్ని కమర్షియల్ గా వాడుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. మరి ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.