Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : నితిన్ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   21 Jun 2019 3:32 PM GMT
ఫోటో స్టోరీ : నితిన్ సర్ ప్రైజ్
X
వర్షం వస్తే ... హైదరాబాదీలకు గుబలు. ఇంటికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతామేమో అని. చిన్నవానకే జలమయమయ్యే రోడ్లతో సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో ట్రాఫిక్ మొత్తం స్తంభిస్తుంది. అదేంటో గాని హైదరాబాదులో వర్షం ఎపుడూ మధ్యాహ్నం తర్వాతే వస్తుంటుంది. ఈరోజు కూడా అంతే. అయితే, ఈసారి వర్షంలో మన సెలబ్రిటీ నితిన్ చిక్కుకన్నాడు. ఇక విషయం అర్థమై రోడ్లను నమ్ముకుంటే ఇక అంతే సంగతులు అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు.

త్వరగా ఇంటికి చేరుకోవడానికి కారు దిగి మెట్రో ఎక్కారు నితిన్. అతన్ని చూసి ప్రయాణికులు సర్ ప్రైజ్ ఫీలయ్యారు. తనే ఓ సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన నితిన్... ‘మెట్రో ప్రయాణం నచ్చింది‘ అని కామెంట్ చేశారు. ‘‘రోడ్లపై భారీ ట్రాఫిక్ ఉంది. ప్యాకప్ అయ్యాక... ఇక మెట్రో ఎక్కేశా. ఈ అనుభవం చాలా బాగుంది‘ అంటూ కామెంట్ చేశారు నితిన్. మొత్తానికి హైదరాబాద్ మెట్రో సామాన్యులనే కాదు - సెలబ్రిటీలకు వరమైందే.