Begin typing your search above and press return to search.

'ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి' : నితిన్

By:  Tupaki Desk   |   27 July 2020 10:20 AM IST
ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి : నితిన్
X
టాలీవుడ్ హీరో నితిన్ ఎట్టకేలకి ఓ ఇంటివాడైయ్యాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌ నుమా ప్యాలెస్ ‌లో జులై 26 , ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌–షాలినీ ల పెళ్లి , కరోనా నిబంధనలను పాటిస్తూ , అతికొద్దిమంది ఆత్మీయులు , సన్నిహితుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుండి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ , హీరో కార్తికేయ హాజరైయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వివాహం తరువాత షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన నితిన్‌ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని కోరాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్‌, లాక్‌ డౌన్‌ కారణంగా వివాహ వేడుకను వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆదివారం రాత్రి పెళ్లి షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు.

ఇక నితిన్ సినిమా విషయానికొస్తే .. నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి ఫేం కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్‌ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్‌ మ్యారేజ్‌ గిఫ్ట్‌ టు అవర్‌ హీరో’ అంటూ రంగ్‌ దే టీమ్‌ టీజర్‌ ని విడుదల చేసింది. అన్ని అనుకున్నట్టు జరిగితే 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు టీజర్‌ లో ప్రకటించారు.