Begin typing your search above and press return to search.

నితిన్ విదేశాలకు వెళ్లేలా ప్లాన్స్ చేసుకుంటున్నారా...?

By:  Tupaki Desk   |   28 July 2020 11:30 PM GMT
నితిన్ విదేశాలకు వెళ్లేలా ప్లాన్స్ చేసుకుంటున్నారా...?
X
టాలీవుడ్ యువ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌ లోని ఫలక్‌ నుమా ప్యాలస్‌ లో జులై 26 రాత్రి నితిన్ - షాలిని వివాహం ఘనంగా జరిగింది. నితిన్ - షాలిని జంట కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితులు అతిథుల సమక్షంలో శుభముహూర్తానికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నిజానికి ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఫంక్షన్ చేసుకున్న నితిన్ - షాలిని జంట ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దుబాయ్‌ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్‌ కు ప్లాన్ చేసుకుంటే కరోనా పరిస్థితుల కారణంగా కుదరలేదు. దీంతో జులై 22న నిశ్చితార్థం చేసుకొని ఐదు రోజుల పెళ్లి వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్ - సంగీత్ ఫంక్షన్ - పెళ్లి కొడుకు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో జులై 26న షాలిని మెడలో నితిన్ మూడుముళ్లు వేశారు. కాగా వెడ్డింగ్ ఎలాగూ ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు జరగలేదని.. ఇప్పుడు హనీమూన్ కోసమైనా విదేశాలకు వెళ్లాలని నితిన్ అనుకుంటున్నారట. అయితే అది కూడా షూటింగ్ లో భాగంగానే వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారట.

కాగా నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ''రంగ్ దే'' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సాంగ్స్ షూట్ కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారట. అయితే జూలై 31 వరకు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ నిషేధించబడింది. ఒకవేళ విదేశీ ప్రయాణంపై బ్యాన్ ఎత్తేసి పరిస్థితులు అనుకూలిస్తే చిత్ర యూనిట్ తో పాటు నితిన్ తన సతీమణిని కూడా తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాడట. మరి కొత్త పెళ్ళికొడుకు నితిన్ వర్కింగ్ హనీమూన్ ప్లాన్స్ జరుగుతాయేమో చూడాలి.