Begin typing your search above and press return to search.

నితిన్ ఫస్ట్ క్లాస్ లో పాస్..!

By:  Tupaki Desk   |   2 March 2021 6:33 AM GMT
నితిన్ ఫస్ట్ క్లాస్ లో పాస్..!
X
యూత్ స్టార్ నితిన్ గతేడాది ప్రారంభంలో 'భీష్మ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ జోష్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది నెల రోజుల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలకు రెడీ చేసిన నితిన్.. మొత్తం మీద 2021 ప్రథమార్థంలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన 'చెక్' సినిమాను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ డే టాక్ ఎలా ఉన్నా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాతో నటన పరంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లేనని ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క సాంగ్ తో కెరీర్ లో మొదటి సారి చేసిన ఈ కాన్సెప్ట్ ఓరియెంట్ మూవీ నితిన్ ని నటుడిగా మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు.

అయితే 'భీష్మ' స‌క్సెస్ మేనియా ఇంకా నితిన్ మీద ఉండటం కూడా 'చెక్' బాక్సాఫీస్ గండాన్ని ఈజీగా దాటేయడానికి హెల్ప్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు 'రంగ్ దే' అనే కామ‌న్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అర్బ‌న్ ఎమోష‌న్స్ చుట్టూ న‌డుస్తోందని తెలుస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 'ఉప్పెన' వంటి సినిమా వ‌సూళ్ల‌లో మెజారిటీ క్రెడిట్ కొట్టేసిన దేవిశ్రీ.. ఇప్పుడు 'రంగ్ దే' ఓపెనింగ్స్ కి కూడా హెల్ప్ అవనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'ఏమిటో ఇది' 'బస్టాండే బస్టాండే' సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమా నితిన్ కి హైట్రిక్ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.