Begin typing your search above and press return to search.

నితిన్ పెళ్లి కబుర్లు

By:  Tupaki Desk   |   23 July 2018 6:43 AM GMT
నితిన్ పెళ్లి కబుర్లు
X
టాలీవుడ్ లో ఇప్పుడున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నితిన్ కూడా ఉన్నాడు. హీరో గా జయంతో కెరీర్ మొదలుపెట్టి చల్ మోహనరంగతో 25 సినిమాలు పూర్తి చేసుకున్నా అభిమానులు ఎదురు చూస్తున్న పప్పన్నం గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. అన్ని ప్రేమ కథలే చేయటం వల్ల కాబోలు ఆ ఆలోచన రాలేదు. ఎట్టకేలకు శ్రీనివాస కళ్యాణం ఆ మార్పు తీసుకొచ్చేసింది. నిన్న జరిగిన ఆడియో వేడుకలో తన పెళ్లి గురించి పూర్తిగా ఓపెన్ అయ్యాడు నితిన్. కాకపోతే అమ్మాయి గురించి కాదులెండి. ఇంట్లో తనను పెళ్లి చేసుకోమని చేస్తున్న పోరు గురించి. శ్రీనివాస కళ్యాణం షూటింగ్ కన్నా ముందు తనకు పెళ్లి మీద అంత సీరియస్ గా ఆలోచన లేదన్న నితిన్ ఇది చూసాక అచ్చం ఇదే తరహాలో చేసుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకొచ్చాడు. కాకపోతే పూజలు-వ్రతాలు-నోములు అంటూ ఇంత తతంగం ఉంటుందని తెలియదని ఇవన్నీ కాకపోయినా ముఖ్యమైనవి మాత్రం మిస్ చేయనని చెప్పుకొచ్చాడు.తన తల్లిని ఉద్దేశించి అమ్మా త్వరలో నీకు నచ్చే కోడలిని తీసుకొస్తానని చెప్పేసిన నితిన్ అది ఎంత టైంలోపు అనే మాట మాత్రం చెప్పలేదు.

నితిన్ తన మాటల్లో శ్రీనివాస కళ్యాణం పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో బయటపెట్టేసుకున్నాడు. నిర్మాత రాజు తో దిల్ సినిమా చేస్తున్నప్ప్పుడు మొదటి సినిమాకే ఈయన ఇంత ఓవర్ చేస్తున్నాడే అనుకునేవాడినని కానీ ఆ విజయం ఆయన ఇంటి పేరుగా మారాక ఆయన కష్టం తెలిసివచ్చిందని ప్రశంశించిన నితిన్ తమ కాంబోలో రెండో సినిమా రావడానికి 15 ఏళ్ళు పట్టిందని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ముసలివాడిని అయ్యాక నటించిన సినిమాలు అన్నిటిలోకి టాప్ 1 లేదా 2 లో ఈ శ్రీనివాస కళ్యాణం ఉంటుందని చెప్పిన నితిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మిక్కీ జె మేయర్ ని ఆకాశానికెత్తేశాడు. అందులో అతిశయోక్తి ఉందని చెప్పడానికి లేదు. కళ్యాణం వైభోగం అంటూ సాగే టైటిల్ సాంగ్ ఇప్పటికే పెళ్లి వేడుకలతో పాటు వీడియో మిక్సింగ్ లలో మారుమ్రోగిపోతోంది. ఆగష్టు 9న విడుదల కానున్న శ్రీనివాస కళ్యాణం మీద ఫ్యామిలీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. ఓవర్సీస్ లో సైతం భారీ బజ్ అందుకున్న ఈ మూవీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో పెళ్లి సినిమాల ట్రెండ్ ని తిరిగి తీసుకొస్తుందనే అంచనాలు చాలా ఉన్నాయి.