Begin typing your search above and press return to search.

అదండీ.. నితిన్ తదుపరి సినిమా

By:  Tupaki Desk   |   8 Sept 2016 3:27 PM IST
అదండీ.. నితిన్ తదుపరి సినిమా
X
''అ..ఆ'' సినిమా 50 కోట్ల క్లబ్ ను జస్ట్ మిస్సయినా కూడా.. అసలు నితిన్ సినిమా ఆ రేంజులో ఆడమంటే పెద్ద విషయమే. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ.. సమంత గ్లామరస్ ఎట్రాక్షన్ లకు తోడు నితిన్ సటిల్ పెర్ఫామెన్స్ కూడా ఇరగదీయడంతో.. ఆ సినిమా అంత పెద్ద హిట్టయ్యింది. అందుకే ఆ సినిమా రిలీజైనప్పటి నుండి అసలు మనోడు తదుపరి ఏ సినిమా చేస్తున్నాడనే సందేహం ఉండనే ఉంది.

అయితే తుపాకి.కామ్ ముందే చెప్పిందిగా.. దర్శకుడు హను రాఘవపూడి కుర్ర హీరో అఖిల్ తో చేద్దామని అనుకున్న స్టోరీ చివరకు వర్కవుట్ కాకపోవడంతో.. ఆ కథను ఇప్పుడు నితిన్ హీరోగా చేసే ఛాన్సుందని. ఇవాళే నితిన్ అండ్ హను కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. నిజానికి అఖిల్ ఆ సినిమాను చేయకపోవడానికి కారణం.. అఖిల్ తన రెండో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందించాలని చూస్తుంటే.. ఇవతల హను మాత్రం బ్యాక్ టు బ్యాక్ 14 రీల్స్ వారికి సినిమా చేస్తానని ఎగ్రిమెంట్ చేసుకున్నాడు. అందుకే సదరు ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే 14 రీల్స్ సంస్థ నితిన్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.