Begin typing your search above and press return to search.

నితిన్ దారి మార్చాడు అంతే

By:  Tupaki Desk   |   2 Jun 2018 10:35 AM IST
నితిన్ దారి మార్చాడు అంతే
X
హీరో నితిన్ ను ఈమధ్య వరసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అ.ఆ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. తరవాత గా అతడు నటించిన లై.. చల్ మోహనరంగ సినిమాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నితిన్ తరవాత చేయబోయే సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

నితిన్ తాజాగా శ్రీనివాస కళ్యాణం మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టెయినర్. దీని తరవాత ఓ యాక్షన్ ఎంటర్ టెయినర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి చెప్పిన ఓ సబ్జెక్ట్ నచ్చడంతో అతడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఎప్పుడూ ఓ కొత్త జోనర్ లో సినిమా తీస్తూ రావడం చంద్రశేఖర్ యేలేటి స్పెషాలిటీ. ఇంతకుముందు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మనమంతా సినిమా తీశాడు. ఈ సినిమా ఆడకపోయినా మంచి విలువలున్న చిత్రంగా పేరు తెచ్చుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా తీయడంలో చంద్రశేఖర్ యేలేటికి ఉన్న పట్టు తెలుసు కాబట్టి నితిన్ ఈ సినిమా చేయడానికి రెడీ అయినట్టు అతడి సన్నిహితులు చెబుతున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్ చేస్తున్న శ్రీనివాస కళ్యాణం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంతకుముందు శతమానం భవతి లాంటి డీసెంట్ ఫ్యామిలీ మూవీ తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి శ్రీనివాస కళ్యాణంపై బజ్ బాగానే ఉంది. రాశీఖన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.