Begin typing your search above and press return to search.

భీష్మ తర్వాత నితిన్‌ కీలక అనౌన్స్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   13 Feb 2020 5:00 AM IST
భీష్మ తర్వాత నితిన్‌ కీలక అనౌన్స్‌ మెంట్‌
X
హీరో నితిన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. శాలిని అనే అమ్మాయిని ప్రేమించిన నితిన్‌ పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దం అయ్యాడంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో నితిన్‌ తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. అన్నట్లుగానే ఈ సమ్మర్‌ లో నితిన్‌ వివాహం జరుగబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రాలేదు కాని అన్ని పనులు చకచక జరుగుతున్నట్లుగా నితిన్‌ కుటుంబంకు సన్నిహితంగా ఉండే వారు కొందరు చెబుతున్నారు.

ప్రస్తుతం నితిన్‌ భీష్మ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. ఈనెల 21న భీష్మ చిత్రం విడుదల కాబోతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ఈ చిత్రంపై నితిన్‌ చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. భీష్మ చిత్రం విడుదలైన తర్వాత తన పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటన చేస్తాడంటూ సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్‌ రెండవ లేదా మూడవ వారంలో పెళ్లి జరుగబోతుందట. ఈనెల లోనే పెళ్లి పనులు ప్రారంభించబోతున్నారు. పెళ్లి పనులు ప్రారంభించిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఇప్పటి వరకు నితిన్‌ చేసుకోబోతున్న అమ్మాయి ఎలా ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు. వన్స్‌ పెళ్లి ప్రకటన వచ్చిన తర్వాత ఆమె ఫొటోలు బయటకు వచ్చే అవకాశం ఉంది.