Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : నితిన్‌ కూడా అదే ట్రెండ్‌ ఫాలో అయ్యాడు

By:  Tupaki Desk   |   13 Feb 2020 10:15 AM IST
ఫొటోటాక్‌ : నితిన్‌ కూడా అదే ట్రెండ్‌ ఫాలో అయ్యాడు
X
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లుగా పాతవన్నీ కూడా ఇప్పుడు మళ్లీ స్టైల్‌ అవుతున్నాయి. ఒకప్పటి హీరోల స్టైల్‌ ఇప్పటి స్టైల్‌ విషయంలో చాలా చాలా తేడా ఉన్నాయి. పాత హీరోల కాస్ట్యూమ్స్‌ మరియు ప్రస్తుత హీరోల కాస్ట్యూమ్స్‌ విషయంలో నక్కకు నాగలోకంకు ఉన్న తేడా ఉంది. మొన్నటి వరకు వాటిని చూసి బాబోయ్‌ అవేం కాస్ట్యూమ్స్‌ అనుకున్న వారు ఇప్పుడు వాటినే కొత్త స్టైల్‌ అంటూ తెగ వాడేస్తున్నారు.

ఇక ఈమద్య కాలంలో సినిమాల్లో హీరోలు లేదా సినిమాలోనే ఏదో ఒక పాత్ర పాత తరం స్టార్స్‌ కాస్ట్యూమ్స్‌ ను ధరించి సందడి చేయడం మనకు కనిపిస్తుంది. ఓల్డ్‌ స్టైల్‌ కాస్ట్యూమ్స్‌ లో ఈమద్య కాలం లో పలువురు హీరోలు కనిపించారు. ఇదో ట్రెండ్‌ గా కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఆ ట్రెండ్‌ ను యంగ్‌ హీరో నితిన్‌ కూడా ఫాలో అయ్యాడు.

పాత హీరోగా డ్రస్సింగ్‌ అయ్యి.. పాత తరం బుల్లెట్‌ అయిన స్కూటర్‌ పై చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. శోబన్‌ బాబు రింగ్‌ డిఫరెంట్‌ షర్ట్‌ సింపుల్‌ వైట్‌ పాయింట్‌ బజాజ్‌ చేతక్‌ బండిపై నితిన్‌ ‘భీష్మ’ చిత్రంపై ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి.

వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన భీష్మ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చేందుకు రెడీ అయ్యింది. సినిమాకు సంబంధించిన సింగిల్స్‌ ఆంథమ్‌ థీమ్‌ వీడియోను ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నారు.

వీడియో విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించేందుకు ఈ ఫొటో స్టిల్‌ ను భీష్మ టీం వాడారు. ఆ థీమ్‌ వీడియో ఏమో కాని ఈ స్టిల్‌ మాత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేపు విడుదల కాబోతున్న థీమ్‌ వీడియోలో ఈ స్టైల్‌ లో నితిన్‌ మరింతగా కనిపిస్తాడేమో చూడాలి.