Begin typing your search above and press return to search.

యంగ్ హీరో భుజానికి ఏమైంది?

By:  Tupaki Desk   |   26 Feb 2018 12:11 AM GMT
యంగ్ హీరో భుజానికి ఏమైంది?
X
సినిమా షూటింగ్స్ లలో హీరోలు గాయపడటం మాములే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యాక్షన్ పరమైన సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తిప్పలు తప్పవు. అలాగే స్పీడ్ డ్యాన్సులు చేసే హీరోలు కూడా అప్పుడప్పుడు గాయాలపాలవుతుంటారు. ముఖ్యంగా యువ హీరోలు అలాంటి చేదు అనుభవాలకు గురవుతుంటారు. మంచి మూమెంట్స్ కోసం కష్టపడే తరుణంలో కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే రీసెంట్ గా నితిన్ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. నితిన్ తన ప్రతి సినిమాల్లో డ్యాన్సుల కోసం ప్రత్యేక కొరియోగ్రాఫర్ ని సెట్ చేసుకుంటాడు. స్టెప్పులు హైలెట్ గా ఉండాలని చాలా శ్రద్ధ వహిస్తాడు. అందుకే నితిన్ సినిమాల్లో కొన్ని స్టెప్పులు అభిమానులకు తెగ నచ్చేస్తాయి. అయితే ప్రస్తుతం నితిన్ చల్ మోహన్ రంగ అనే సినిమాను చేస్తోన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ అలాగే నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా సినిమాలోని కీలకమైన పాట చిత్రీకరణలో నితిన్ కొన్ని వెరైటీ స్టెప్పులను ట్రై చేశాడట.

అయితే డ్యాన్స్ మూమెంట్స్ లలో సడన్ గా నితిన్ కు భుజం కండరాలలో నొప్పి వేయడం మొదలైంది. వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి నితిన్ కి ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేశారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కేవలం సాంగ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట. నితిన్ కొద్దిగా కొలుకోగానే వాటిని ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తొందరగా ఫినిష్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ వేస్తోంది. సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.