Begin typing your search above and press return to search.

నితిన్ డైరెక్టర్ ఒకే , కానీ మిగతా వాళ్ళ సంగతేంటి ?

By:  Tupaki Desk   |   26 Feb 2020 11:30 AM GMT
నితిన్ డైరెక్టర్ ఒకే , కానీ మిగతా వాళ్ళ సంగతేంటి ?
X
2018లో చాలా మంది కుర్ర దర్శకులు మెగా ఫోన్ పట్టి సూపర్ హిట్లు కొట్టారు. అందులో వెంకీ కుడుముల ఒకడు. వెంకీ కుడుముల ఆ ఏడాది ఫిబ్రవరిలో 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టాడు.ఆ వెంటనే వారం గ్యాప్ లో వెంకీ అట్లూరి 'తొలి ప్రేమ' తో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే ఏడాది 'గూఢచారి'తో శశి కిరణ్ , 'ఆర్ ఎక్స్ 100' తో అజయ్ భూపతి కూడా మంచి సక్సెస్ చూసారు. ఇక రాహుల్, వెంకటేష్ మహా లాంటి దర్శకులు కమర్షియల్ గా హిట్స్ అందుకోకపోయినా ప్రశంసలు అందుకున్నారు.

ఇలా ఆ ఏడాది హిట్స్ అందుకున్న డెబ్యూ డైరెక్టర్స్ లో ఇద్దరు మాత్రమే గ్యాప్ తీసుకోకుండా గతేడాది కూడా ఓ సినిమా డెలివరీ చేసారు. కట్ చేస్తే రిజల్ట్ తేడా కొట్టింది. 'మన్మథుడు 2' తో రాహుల్ , 'మిస్టర్ మజ్ను' తో వెంకీ అట్లూరి ఫ్లాప్స్ అందుకొని బోల్తా కొట్టారు. అయితే వారిలా కంగారు పడకుండా లేట్ గానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి రెండో సినిమా గండాన్ని సింపుల్ గా దాటేసాడు వెంకీ కుడుముల. దీంతో రెండో సినిమాకి ఇంత ఆలస్యమా అనుకున్న వారంతా ఇప్పుడు వెంకీ సక్సెస్ చూసి లేటయినా మంచి హిట్ కొట్టాడే అనుకుంటున్నారు.

ఇక వెంకీ కుడుముల లాగే శశి కిరణ్ తిక్క , వెంకటేశ్ మహా , అజయ్ భూపతి ఈ ఏడాది తమ సినిమా తో రెండో సినిమా గండాన్ని దాటేసి ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి. ప్రస్తుతం శశి కిరణ్ 'మేజర్' అనే సినిమా చేస్తుంటే వెంకటేష్ మహా 'ఉమా మహేశ్వరఉగ్ర రూపశ్య' సినిమాను రిలీజ్ కి రెడీ చేసాడు. అజయ్ ఇంకా నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టలేదు.