Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మ‌హాన‌టినే ఆట‌ప‌ట్టిస్తారా?

By:  Tupaki Desk   |   27 Nov 2020 9:15 AM IST
ఫోటో స్టోరి: మ‌హాన‌టినే ఆట‌ప‌ట్టిస్తారా?
X
ఒక‌ప్పుడు ఆన్ లొకేష‌న్ తార‌లంతా క‌లిసి ఒక కుటుంబంలా సెల‌బ్రేష‌న్ చేసుకునేవారు. షూట్ గ్యాప్ లో తోటి తార‌ల‌తో స‌ర‌దా చాటింగులు .. మ‌ధ్యాహ్నాల వేళ క‌లిసి భోజ‌నం చేయ‌డం.. ఇంటి నుంచి తెచ్చిన క్యారేజీని వ‌డ్డించ‌డం.. వ‌గైరా వ‌గైరా స‌న్నివేశాలు పండ‌గ‌నే త‌ల‌పించేవ‌‌ని క్లాసిక్ డేస్ న‌టీన‌టులు చెబుతుంటారు.

కానీ ఇప్పుడు అలాంటి వాతావ‌ర‌ణం ఉందా? అంటే .. స‌ర‌దా వాతావ‌ర‌ణం ఉంటుంది. కానీ అది రేర్ అయిపోయింద‌ని చెబుతుంటారు. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుని షాట్ అయిపోగానే వెళ్లిపోయేంత‌గా బిజీ లైఫ్ ప‌ర్య‌వ‌సానం ఉంటుంద‌ని చెబుతుంటారు. అయితే అందుకు భిన్నంగా ఓ ఆహ్లాద‌క‌ర‌మైన దృశ్యం నితిన్ అండ్ టీమ్ సెట్స్ లో క‌నిపించింది.

కీర్తి సురేష్ ఇదిగో ఇలా ఆన్ లొకేష‌న్ క‌ళ్ల‌పై ట‌వ‌ల్ వేసుకుని సేద దీరుతుంటే ఆ వెన‌క‌గా వ‌చ్చిన నితిన్ .. ద‌ర్శ‌కుడు వెంకీ త‌న‌ని ఎలా ఏడిపిస్తున్నారో చూశారుగా.. ఆ అరుదైన దృశ్యం కెమెరాలో క్యాప్చుర్ అయ్యింది.

నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా సితార ఎంటర్ టైన్ ‌మెంట్స్‌ రూపొందిస్తున్న చిత్రం రంగ్ దే సెట్స్ లో దృశ్య‌మిది. మేము చెమటలు పట్టేలా ప‌ని చేస్తుంటే.. నువ్విలా సేదతీరుతున్నావా? అంటూ నితిన్ ఆట ప‌ట్టించారు. అదే విష‌యాన్ని ఫోటోతో పాటు సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించారు నితిన్. ఇక నితిన్‌ చేసిన ఈ ట్వీట్ కి వెంటనే రిప్లయ్‌ ఇచ్చింది కీర్తిసురేష్‌. ``నాకు తెలుసు.. మీరు జెలసీగా ఫీలయ్యారని..`` అని జ‌వాబిచ్చింది కీర్తి. దీనికి నెటిజనులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

రంగ్ దే ప్రోమోలన్నింటికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 2021 సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేసేందుకు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత వంశీ సన్నాహాలు చేస్తున్నారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.