Begin typing your search above and press return to search.

నితిన్‌ అభిమానులు కూడా అదే తప్పు చేశారు

By:  Tupaki Desk   |   2 March 2021 7:30 AM GMT
నితిన్‌ అభిమానులు కూడా అదే తప్పు చేశారు
X
టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ స్టార్‌ హీరోల అభిమానుల అత్యుత్సాహం కొన్ని సార్లు ఆ హీరోలను విమర్శలు పాలు చేస్తుంది. ముఖ్యంగా స్టార్స్ సినిమాలు విడుదల సమయంలో అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సౌత్‌ లో ఉన్న పలువురు యంగ్ సీనియర్‌ స్టార్‌ హీరోల అభిమానులు కొత్త సినిమా లు వస్తున్నాయి అంటే రచ్చ రచ్చ చేసేందుకు సిద్దం అవుతున్నారు. పెద్ద పెద్ద కటౌట్‌ లు భారీ ప్లెక్సీలు హోర్డింగ్ లు ఇలా ఒకటా రెండా ఎన్నో చేస్తూ ఉంటారు. కటౌట్‌ లకు బిందెల కొద్ది పాలను కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. డబ్బును నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టడం ఎప్పుడూ కూడా వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. తాజాగా నితిన్ నటించిన చెక్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సందర్బంగా నితిన్‌ అభిమానులు చాలా చోట్ల ఆయన పోస్టర్లకు కటౌట్‌ లకు పాలాభిషేకాలు చేశారు. పాలు లేక ఎంతో మంది చిన్నారులు మృతి చెందుతూ ఉంటే నితిన్ అభిమానులు ఇలా పాలను వృదా చేయడం ఏమాత్రం బాగాలేదు అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసి హీరోల ను జీరోలుగా మార్చుతున్నారు తప్ప వారి స్టార్‌ డం ను పెంచడం లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సినిమాల విడుదల సమయంలో ఏదైనా సందడి చేయాలంటే పేదలకు సాయం చేయడం.. చిన్నారులకు కడుపు నింపడం వంటివి చేయాలి. ఇతర స్టార్‌ హీరోల అభిమానుల మాదిరిగానే నితిన్ అభిమానులు కూడా ఇలా చేయడం విడ్డూరంగా ఉంది. ఇకపై అయినా నితిన్ అభిమానులు ఈ తప్పు చేయకుండా ఉంటారని ఆశిద్దాం.